రజనీ వద్దన్నారు..అందుకే ‘2.ఒ’ ఒప్పుకోలేదు!
దక్షిణాదిన అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిన మొదటి చిత్రం ‘రోబో’. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా శంకర్ ‘2.ఒ’ రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ని విలన్‌గా నటింపజేయాలని శంకర్ అనుకున్నారట. అమితాబ్‌కు ఆయన ఈ విషయం చెప్పారట. శంకర్ ఈ విషయం చెప్పగానే రజనీకి ఫోన్ కొట్టారు బిగ్ బి. ‘‘మిమ్మల్ని విలన్‌గా ప్రేక్షకులు అంగీకరించరు. అందుకని వద్దు’’ అని రజనీ అన్నారు. నేను కూడా ఓకే అన్నాను’’ అని అమితాబ్ పేర్కొన్నారు.
Post a Comment