షారుక్‌కి జాతీయ అవార్డు రాకూడదు!
అభిమానులు పూజలు మొదలుపెట్టారు!
ఏ అభిమాని అయినా తమ అభిమాన హీరో బోల్డన్ని అవార్డులూ, రివార్డులూ అందుకోవాలని కోరుకుంటాడు. షారుక్ ఖాన్ అభిమానులు కూడా అలానే ఆశిస్తారు. కానీ, ఇప్పుడు మాత్రం తమ అభిమాన నాయకుడికి పొరపాటున కూడా జాతీయ అవార్డు రాకూడదని తమ ఇష్టదైవానికి విన్నవించుకుంటున్నారు.
విచిత్రంగా ఉంది కదూ! షారుక్ ఇచ్చిన ఓ స్టేట్‌మెంటే వాళ్లిలా చేయడానికి కారణమైంది. 23 ఏళ్ల కెరీర్‌లో జాతీయ అవార్డు తప్ప ఎన్నో అవార్డులు అందుకున్నారు షారుక్. కానీ, ఒక్క జాతీయ అవార్డు కూడా రాలేదని ఆయన బాధపడిపోతున్నారు. అందుకే, ప్రస్తుతం నటిస్తున్న ‘ఫ్యాన్’ చిత్రం ద్వారా ఆ అవార్డుని టార్గెట్ చేశారట. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఇందులో స్టార్ హీరోగా, అతని అభిమానిగా షారుక్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 50 ఏళ్ల షారుక్‌ఖాన్ ఫ్యాన్ రోల్ కోసం 24 ఏళ్ల కుర్రాడిగా కనిపించనున్నారు. సగం వయసు తగ్గి కనిపించడం కోసం కఠినమైన కసరత్తులే చేశారట. జాతీయ అవార్డును టార్గెట్ చేసే ఇలా చేశారా? అనే ప్రశ్న షారుక్ ముందుంచితే - ‘‘అవును... ఒక్కసారి ఆ అవార్డు వస్తే చాలు.. వెంటనే రిటైరైపోతా’’ అని బదులిచ్చారు. ఇది విన్న అభిమానులు ఫీలైపోతున్నారు. అందుకే జాతీయ అవార్డు రాకూడదని కోరుకుంటున్నారు.

Post a Comment