ఆసీస్ దే పైచేయి
అయితే బ్రేవో(33) రెండో వికెట్ గా పెవిలియన్ చేరిన అనంతరం విండీస్ వరుసగా కీలక వికెట్లను కోల్పోయింది. మార్లోన్ శామ్యూల్స్(4), బ్లాక్ వుడ్(10),హెల్డర్(1) లు స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రామ్ దిన్(23 బ్యాటింగ్),కార్లోస్ బ్రాత్ వైట్(35 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ కు రెండు, హజిల్ వుడ్, పాటిన్సన్, ఓ కీఫ్ లకు తలో వికెట్ దక్కింది.ఇప్పటికే రెండు టెస్టుల్లో గెలిచిన ఆసీస్ సిరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
Post a Comment