ఆది హీరోగా తెరకెక్కిన 'ప్రేమ కావాలి' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఇషా చావ్లా. తరువాత పూల రంగడు సినిమాతో మరో సక్సెస్ సాధించిన ఈ ఢిల్లీ భామ అనంతరం బాలకృష్ణ లాంటి స్టార్ హీరో సరసన శ్రీమన్నారాయణ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆడకపోవటం, ఆ తరువాత అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన జంప్ జిలానీ సినిమా కూడా నిరాశపరచటంతో ఇషా తెరమీద కనిపించటం మానేసింది.
లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది ఇషా చావ్లా. అయితే హీరోయిన్ గా వర్క్ అవుట్ కాకపోవటంతో ఈ సారి స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్న సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'సుప్రీమ్' సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సుప్రీం వేసవిలో రిలీజ్ కు రెడీ అవుతోంది.
Post a Comment