సెట్స్ మీదకు రాక ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసిన సర్థార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో కూడా రోజుకో వార్తతో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే షూటింగ్ లొకేషన్ లో ఫోటోలతో సోషల్ మీడియా మోత మోగిపోతుంటే, తాజాగా మరో ఆసక్తికరమైన వార్త మెగా అభిమానులకు పండగ వాతావరణం తీసుకు వచ్చింది. సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాతో మరో మెగా వారసుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ చిన్న బాబును కాపాడే సన్నివేశం ఉందట. అయితే ఆ సీన్ లో అల్లు అర్జున్ తనయుడు అయాన్ నటిస్తున్నాడన్నదే ఇప్పుడు మెగా సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త. ఇప్పటికే బన్నీ ఫేస్ బుక్ పేజ్ మీద మంచి క్రేజ్ తెచ్చుకున్న అయాన్ త్వరలోనే వెండితెర మీద కనిపించనున్నాడన్న న్యూస్ మెగా అభిమానులను ఊరిస్తోంది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా పవర్ స్టార్, అల్లు అర్జున్ అభిమానులకు మాత్రం పండగ పూట ఇది తీపి కబురే అని చెప్పాలి.
Post a Comment