-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 03, 2016

సఫారీల 'చెత్త' రికార్డు!


సఫారీల 'చెత్త' రికార్డు!
కేప్ టౌన్:ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా చెత్త రికార్డును మూట గట్టుకుంది. స్వదేశంలో జరుగుతున్న టెస్టులో సఫారీలు పేలవమైన బౌలింగ్ గణాంకాలను నమోదు చేశారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో నలుగురు సఫారీ బౌలర్లు వందకు పైగా పరుగులను సమర్పించుకుని 13 ఏళ్లనాటి  చెత్త రికార్డును మరోసారి తిరగరాశారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్నీ మోర్కెల్(29.0 ఓవర్లు, 114 పరుగులు, 1 వికెట్), క్రిస్ మోరిస్(28.0 ఓవర్లు 150 పరుగులు 1 వికెట్), రబడా(29.5 ఓవర్లు,175 పరుగులు 3 వికెట్లు), డేన్ పీడ్త్(25.0 ఓవర్లు, 112 పరుగులు, వికెట్లు లేవు) ఇలా భారీగా పరుగులిచ్చి ఢీలా పడ్డారు. అంతకుముందు 2002లో జోహనెస్ బర్గ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా ఈ తరహాలోనే పరుగులు సమర్పించుకుంది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు సఫారీలు చెత్త బౌలింగ్ గణాంకాలను లిఖించుకోవడం గమనార్హం.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu