తెరపైకి రోజా బయోగ్రఫీ?
ప్రముఖ నటి, ఆంధ్రప్రదేశ్, నగిరి శాసన సభ్యురాలు రోజా జీవిత చరిత్ర వెండి తెరకెక్కనుందా? ఈ ప్రశ్నకు అవుననే బదులు సినీవర్గాల నుంచి వస్తుండడం విశేషం. రోజా నట జీవితం కానీవ్వండి, రాజకీయ జీవితం కానీవ్వండి సంచలనాల మయం. ఈ రెండింటిలోనూ రోజా అంచలంచెలుగా కాదు వేగంగానే ఎదిగారు. అందుకు పడిన శ్రమ, చేసిన పోరాటాలు చాలానే.
రోజా ప్రముఖ కథానాయకిగా తమిళం, తెలుగు భాషల్లో అనేక విజయాలను సాధించారు. అగ్రకథానాయకిగా వెలుగొందుతుండగానే రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఆ రంగంలోనూ ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రముఖ నాయకురాలుగా ఎదిగారు. ప్రస్తుతం వైఎస్‌ఆర్ పార్టీ నేతగా నగరి ఎంఎల్‌ఏగా ప్రజావాణిని శాసనసభలో వినిపిస్తున్నారు. అలాంటి రోజా వ్యక్తిగత జీవితం ఆసక్తికరమే.
చంబరుతి చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోనూ, ప్రేమతపస్సు చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలోనూ నాయకిగా అడుగు పెట్టి ప్రేమ ఇతివృత్తంగా రూపొందిన ఈ రెండు చిత్రాల్లోనూ తనదైన శైలిలో నటనను ప్రదర్శించి విమర్శకులు సైతం మెప్పించారు. తన తొలి తమిళ చిత్ర దర్శకుడు ఆర్‌కే.సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా అన్ని కోణాల్లోనూ తనదైన ముద్ర వేసుకుని విజయాలను సొంతం చేసుకున్న రోజా జీవిత చరిత్ర వెండి తెరకెక్కనుందనే ప్రచారం కోలీవుడ్‌లో సాగుతోంది.అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన లేదన్నది గమనార్హం.

Post a Comment