'పద్మభూషణ్' కోసం నటి లాబీయింగ్!
' పద్మభూషణ్ పురస్కారం కోసం తన పేరు సిఫారసు చేయాలని ఆశా పరేఖ్ నన్ను కోరింది. మా అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ పనిచేయడం లేదు. అందువల్ల 12 అంతస్తుల ఎక్కి వచ్చి మరీ ఆమె నన్ను వ్యక్తిగతంగా కలిసింది. ఇది నాకేమీ మంచిగా అనిపించలేదు' అని గడ్కరీ పేర్కొన్నారు. శనివారం నాగ్‌పూర్‌లో ఓ వేడుకలో పాల్గొన్న ఆయన ఈ మేరకు విస్మయకర విషయాలు తెలిపారు. భారత సినిమా పరిశ్రమకు అపారమైన సేవలందించిన తాను పద్మభూషణ్ పురస్కారానికి పూర్తిగా అర్హురాలని ఆశా పరేఖ్ తనకు చెప్పిందని గడ్కరీ తెలిపారు.
Post a Comment