కాకిపిల్ల కాకికి ముద్దు అంటారు. అలాంటిదినా శరీరాకృతిని దుస్తులను విమర్శిస్తారా? అసలు నా రూపాన్ని ఎగతాళి చేసే హక్కు మీకెవరు ఇచ్చారు. అంటూ విరుచుకుపడిందో బ్యూటీ .ఆ భామ ఎవరో కాదు అతిలోక సుందిరి శ్రీదేవి కూతురు ఖుషీ. ఇంకా నటిగా రంగప్రవేశం చేయకుండానే ఆ అమ్మాయిని విమర్శించిన వారెవరూ? ఏమాకథ అనేగా మీ కుతూహలం.అయితే రండి చూద్దాం శ్రీదేవి కూతురు ఖుషీ ఇటీవల తన ఫొటోనొకదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట.
ఆ ఫొటోకు రకరకాల విమర్శలతో కూడిన కామెంట్స్ రావడంతో ఖుషీకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది.అలాంటి నాసిరకం కామెంట్లపై ఖుషీ తనదైన శైలిలో విరుచుకుపడింది.మరి ఖుషీ ఆగ్రహ జ్వాల ఏరీతిలో ఉందో చూసేస్తే పోలా.నేను నాకు నచ్చిన ఫొటోను ఎంచుకుని నెట్‌లో పోస్ట్ చేశాను. నాకంటూ ఒక ప్రత్యేక అభిరుచి ఉంది. నా అందమైన రూపాన్ని బహిర్గతం చేయాలనో,మరేదైనా ఆశించో ఆ ఫొటోను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయలేదు. ఆ ఫొటోలోని నా రూపాన్ని పలువురు విమర్శిస్తున్నారు. నా శరీరాకృతి నుంచి దుస్తుల వరకూ కామెంట్ చేసి అవమానపరిచారు. నా ఉదర భాగం షేప్ బాగోలేదని ఎగతాళి చేస్తున్నారు.
మీరు అందం అని భావించే రూపంలో నేను లేను అనడంలోనే మీరెంత అందహీనులో అన్నది తెలుస్తోంది. ఎవరి రూపం వారికి అందంగానే అనిపిస్తుంది. ఇతరులను ఉత్సాహపరిచే పని మీరెందుకు చేయకూడదూ? మీ అందాన్ని మీరు సహించుకుంటున్నప్పుడు నా అందాన్ని నేను అభినందించుకోగలను. ఇతరుల్లోని కొరతలను వెతికే మీరు ఒక రోజు ఆ భ్రమలోంచి బయట పడి కనిపించకుండా పోతారు. మీ కామెంట్స్ ఎంత బాధించాయో నాకు తెలుసు.ఒకరినొకరు అభిమానించుకుందాం.అందర్నీ ప్రేమిద్దాం ,కామెంటర్లకు ఈ విధంగా ఖుషీ చురకలు వేసింది.
Post a Comment