లాస్‌ఏంజిలిస్: ఒక్కసారిగా కనకవర్షం కురిస్తే.. రాత్రికిరాత్రే వేల కోట్ల రూపాయలు వచ్చిపడితే ఎలా ఉంటుంది. అమెరికాకు చెందిన కొందరు అదృష్టవంతుల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద లాటరీ అయిన అమెరికా ‘పవర్‌బాల్ లాటరీ’లో కొందరు ‘లక్ష్మీపుత్రుల’కు రూ. 10,650 కోట్ల లాటరీ తగిలింది. లైవ్‌లో డ్రా తీసి ఎంత మంది విజేతలు ఉంటే వారందరికీ మొత్తాన్ని సమానంగా పంచుతారు. ఈసారి లాటరీ తగిలిన నంబర్లున్న టికెట్లు కొన్నవారు ఐదారుగురు ఉంటారని అంచనా. అందులో కాలిఫోర్నియా, ఫ్లారిడా, టెనెస్సీ ప్రాంతాలకు చెంది ముగ్గురి వివరాలు తెలిసినట్లు లాటరీ వర్గాలు గురువారం వెల్లడించాయి.
లాటరీ మొత్తం రూ. 10,650 కోట్లను 29 ఏళ్లపాటు వాయిదాల్లో చెల్లిస్తారు. ఒకేసారి కావాలంటే రూ. 6,500 కోట్లిస్తారు. సొమ్మును విజేతలు సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది.
Post a Comment