రాజమండ్రి : గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. బోగి మంటలతో పాటు.. కోడి పందాలు జోరుగా మొదలయ్యాయి. ఓ వైపు కోడి పందాలపై పోలీసులు ఆంక్షలు, మరో వైపు హైకోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టి.. పందెంరాయుళ్లు అవేవీ లెక్కచేయకుండా.. పందేల జాతర మొదలు పెట్టారు.
తూర్పు గోదావరి జిల్లాలో కోడిపందాలకు భారీ ఏర్పాట్లు చేశారు. మురిమళ్ల, అల్లవరం, గోడిలంకలో పందేల నిర్వహణకు సర్వం సిద్దమై పోయింది. కాగా.. పోలీసులు సంక్రాంతి కోడి పందాలను దృష్టిలో ఉంచుకుని 1000 మందిపై ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేశారు.
Post a Comment