నాన్నకు ప్రేమతో ట్రెయిలర్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు?
ఈ నేచర్ లో ఎక్కడో జరిగే మూమెంట్ , ఇంకెక్కడో జరిగే మూమెంట్ ని డిసైడ్ చేస్తుందనే డైలాగ్…ఎన్టీఆర్ ఫ్యాన్స్ మూడ్ ని డిస్టర్బ్ చేసింది. ఎన్టీఆర్ కత్తి తిప్పితే, తుపాకితో ఇరగదీస్తేనో చూడాలనుకున్నారు. కానీ నాన్నకు ప్రేమతో కొత్తగా కన్నా వింతగా ఉందంటున్నారు ఆయన అభిమానులు.నాన్నకు ప్రేమతో ట్రెయిలర్ రిచ్ గా, కొత్త లుక్ లో, హాలీవుడ్ రేంజ్ మేకింగ్ తో కొత్తగా ఉంది. ఇది సినిమాలపై బాగా ఆసక్తి ఉన్న నేటి యువత మాట. కానీ ఎన్టీఆర్ కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. తొడకొట్టి, డైలాగ్ లు పేల్చే ఎన్టీఆర్ ఇలా…మిస్టర్ కూల్ లా సైకలాజికల్ గేమ్ ఆడితే నచ్చుతుందా ? అంటే డౌటే? ట‌్రెయిలర్ ఎలా ఉందని మాస్ ఫ్యాన్స్ ని అడిగితే…ఏమో అంటున్నారు. మాకు ఫైట్ లు, పాటలు కావాలి.
ఎన్టీఆర్ ఫైరింగ్ డైలాగ్స్ ఉంటే నచ్చుతుంది. కానీ నాన్నకు ప్రేమతో ఏదో కొత్తగా ఉందని తెల్ల మొహం వేస్తున్నారు కొంత మంది అభిమానులు. మరికొంత మంది బాగుంది…సినిమా చూస్తే కానీ చెప్పలేమంటున్నారు. సుకుమార్ తన మేకింగ్ స్టైల్ ని, కసిని స్టార్ హీరోల మీద ప్రయోగిస్తున్నట్లుంది…చూద్ దాం అని మరికొంత మంది అభిమానులంటున్నారు. ఇక హీరోతో సంబంధం లేని ఫ్యాన్స్ మాత్రం నాన్నకు ప్రేమతో ట్రెయిలర్ అదిరింది అంటున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడని కొత్తదనం కనిపించిందని మాట్లాడుకుంటున్నారు. ఈసినిమా హిట్ అయితే ఎన్టీఆర్ కు ఎంత పేరొస్తుందో….డైరెక్టర్ సుకుమార్ కి కూడా అంతే పేరొస్తుంది.
Post a Comment