మళ్లీ మెదడుకు పని పెట్టనున్న సుకుమార్?
సైకలాజికల్ థ్రిల్లర్ లా ఉంది నాన్నకు ప్రేమతో ట్రెయిలర్. ఇందులో కూడా తండ్రి పగను తీర్చే కొడుకుగా ఎన్టీఆర్ కనిపించాడు. విలన్ జగపతి బాబు-ఎన్టీఆర్ మధ్య సైకలాజికల్ గేమ్ నే సినిమాగా చేసినట్లు కనిపిస్తోంది. ఇది టిపికల్ టాపిక్ అని కనిపిస్తూనే ఉంది. వన్-నేనొక్కడే మాదిరిగా ట్రెయిల్ లో హాలీవుడ్ లుక్ ఉంది. కానీ కామన్ ఆడియెన్ కు అర్ధమయ్యేలా తీస్తే సినిమా బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఇన్సెప్షన్ లాంటి సినిమాను అర్ధం చేసుకోవాలంటే రెండు సార్లు చూసినా ఎక్కదు. కానీ కొత్తగా బాగుటుంది అనిపిస్తుంది.సుకుమార్ మీద హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టొఫర్ నోలన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అది హాలీవుడ్, ఇది టాలీవుడ్. మన ఆడియెన్స్ కి నచ్చితే సినిమా ఎక్కడికో వెళ్తుంది. లేదంటే…మంచి సినిమా అవుతుంది కానీ….కమర్షియల్ గా రిస్క్.
Post a Comment