శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్2 విడుదల
కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం శామ్‌సంగ్ ప్రపంచంలోనే అత్యంత నాజుకైనా ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. ʹగెలాక్సీ ట్యాబ్ ఎస్2ʹ పేరుతో తీసుకొచ్చిన దీని ధర రూ.39,400. భారత్‌లోని నోయిడాలో ఉన్న శ్యామ్‌సంగ్‌కు చెందిన తయారీ కేంద్రంలో ఈ ట్యాబ్లెట్ తయారైంది. 4జీ సేవలకు సహకరిస్తుందని.. దీని మందం 5.6 మి.మీటర్లు, బరువు 392 గ్రాముల వరకు ఉంటుందని కంపెనీ అధికారులు తెలిపారు. పసిడి వర్ణంతో పాటు నలుపు, తెలుపు రంగుల్లో ఇది లభ్యం కానుంది. 32 జీబీ అంతర్గత మెమొరీతో పాటు 128 జీబీ వరకు విస్తరించుకునే వీలుంది. నిన్నటి నుంచే ఈ ట్యాబ్లెట్ విక్రయాలు మొదలయ్యాయని శామ్‌సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ (ఉత్పత్తుల మార్కెటింగ్) మను శర్మ తెలిపారు. ఈ ట్యాబ్లెట్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సొల్యూషన్లు నిక్షిప్తమైఉన్నాయని.. ఒకే సారి రెండు అప్లికేషన్లను వాడుకునే వెసులుబాటు కూడా ఉందని కంపెనీ అధికారులు వెల్లడించారు.
Post a Comment