జగ్గూభాయ్ ఇష్టం లేకున్నా నటించాడా?
నాన్నకు ప్రేమతో ఆడియో వేడుకలో జగపతి బాబు స్పీచ్ అందరినీ కన్ఫ్యూజ్ చేసింది. తాను మొదటిసారి నటించాల్సి వచ్చిందని చెప్పిన ఆయన…ఇందులోని రోల్ చూశాక ఇలాంటి కేరక్టర్ నేను చేశానా అని అనిపిస్తుంది. దయచేసి నాకోసం ఈసినిమాను చూడకండి. ఎన్టీఆర్ కోసం చూడండన్నారు. ఆ తర్వాత నాకు ఈ కథ ఎన్టీఆర్ చెప్పారు. నాసీన్ లు విన్నాక…బాబోయ్ ఇలాంటి కేరక్టర్ నేను చేయాలా అనుకున్నాడట జగ్గూ. తనకు ఇష్టం లేకపోయినా ఈ రోల్ లో నటించాల్సి వచ్చిందని చెప్పాడు జగ్గూ బాయ్. ఎవరైనా ఇందులోని నాకేరక్టర్ చూస్తే డబ్బులు కావాలంటే ఇస్తాం. మరీ ఇలాంటి కేరక్టర్ చేయాలా అంటారు. ఒప్పుకున్నాను కాబట్టి చేయకతప్పలేదని చెప్పుకొచ్చాడు జగపతిబాబు. మరి ఎన్టీఆర్ కోసం ఒప్పుకున్నాక చేశాడని ఆయన మాటలను బట్టి చూస్తే ఇట్టే తెలుస్తుంది.
Post a Comment