రూపాయికే స్మార్ట్ ఫోన్!
కండీషన్స్ అప్లయ్.. ఎక్కడైనా అంతే. ఏదైనా వస్తువుని నమ్మలేని ధరకు ఇస్తారంటే షరతులు వర్తిస్తాయి మరి. చైనీస్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మిజు.. ఎం2 పేరుతో కొత్త ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.6,999. స్నాప్‌డీల్ ద్వారా అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఐతే ఒక రూపాయికే ఈ ఫోన్‌ని పొందే అవకాశాన్ని కల్పిస్తోందీ సంస్థ. ‘రూ.1 కే ఎం2’ అంటూ ఓ ఆన్‌లైన్ కాంటెస్ట్‌ని సైతం ప్రకటించింది. దీనికి మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే. మిజు లోగో ఫోన్‌పై ఎక్కడ, ఎలా ఉంటే బాగుంటుంది..? అనేదాన్ని ఊహించి పెయింట్ చేసి ఆ చిత్రాన్ని మిజు ఇండియా ఫేస్‌బుక్ పేజీలో #?M2FOR1 హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చెయ్యాలి. ఈనెల 21 వరకే ఈ అవకాశం. అలా వచ్చిన చిత్రాల్లో మంచి వాటిని సంస్థ ఎంపిక చేసి వాళ్లందరికీ రూపాయికే ఎం2 ఫోన్‌ని అందజేస్తుంది.
కాంటెస్ట్‌లో పాల్గొననివారు రూ.7వేలకు ఈ ఫోన్‌ను స్నాప్‌డీల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఐఫోన్ 5సిని పోలిన పాలీకార్బనేట్ యూనిబాడీ, 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720X1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, డ్రాగన్ టెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Post a Comment