వాట్సాప్ పై రెండ్రోజుల బ్యాన్
బ్రెజిల్ లో వాట్సాప్ మూగబోయింది. సావోపాలో కోర్టు వాట్సాప్ పై రెండ్రోజుల నిషేధం విధించింది. నేర విచారణకు సహకరించట్లేదన్నది అభియోగం. డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించిన మెసేజ్ లు నిలిపేయాలని కోర్టు ఆదేశించినా వాటికి అడ్డుకట్ట పడలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు రెండ్రోజులపాటు బ్యాన్ చెయ్యాలని ఆదేశించింది. బ్రెజిల్ లో 9 కోట్లకు పైగా ఉన్న వాట్సాప్ ఖాతాలు మూగబోయాయి. ఫేస్ బుక్ యాజమాన్యం కింద ఉన్న వాట్సాప్ ఈ తీర్పుపై తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ఇది ప్రపంచంతో బ్రెజిల్ సంబందాలు తెంపుకోవడమే అని అభివర్ణించింది. దీనిపై ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ విచారం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఓపెన్ ఇంటర్నెట్ పై బ్రెజిల్ ఫ్రెండ్లీగా ఉండేదని.. వాట్సాప్ పై నిషేధం తొలగిపోయేదాకా యూజర్లు ఫేస్ బుక్ మెసెంజర్ వాడుకోవాలని సూచించారు.
Post a Comment