హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమ మరో కమిడయన్ ని కోల్పోయింది. ప్రభాస్ తొలి చిత్రం ఈశ్వర్ సినిమాతో కమెడియన్ గా పరిచయం అయిన నటుడు పొట్టి రాంబాబు(35) ఈ రోజు(మంగళవారం) ఉదయం మరణించారు.
మెదడులో రక్తం గడ్డకట్టి స్ట్రోక్ రావటంతో మంగళవారం ఉదయం మృతి చెందారు. రాంబాబుకు భార్య ఓ కొడుకు, ఓ కుమార్తె ఉన్నారు. రాజమండ్రి దగ్గర బూరుగుపూడి ఆయన స్వగ్రామ
దాదాపు 40కి పైగా సినిమాలో నటించిన రాంబాబు ఈశ్వర్, క్లాస్ రూమ్, చంటిగాడు, కథానాయకుడు, దొంగా దొంగది, అస్త్రం, ప్రేమతో నువ్వు వస్తావని సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.చాలా మంది హాస్యనటులు లు హీరోలుగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నేపధ్యంలో ఇటీవల పులిరాజా ఐపియస్ పేరుతో హీరోగా మారే ప్రయత్నం చేశాడు.
Post a Comment