నాన్నకు ప్రేమతోకి నాన్నే చీఫ్ గెస్ట్!
నాన్నకు ప్రేమతో సినిమా ఆడియో వేడుకకు ఎన్టీఆర్ నాన్న హరికృష్ణే చీఫ్ గెస్ట్. ఇక ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీ కలుపుకునిపోయినా, పోకున్నా హరికృష్ణ తన కొడుకులను మాత్రం కలిపాడు. బాలకృష్ణను కూడా ఈ వేడుకకు పిలవాలనుకున్నా కూడా ఇద్దరి మద్య సంబంధాలు సరిగ్గా లేవు. హరికృష్ణ కలుపుకుని పోవాలని చూసినా కూడా టీడీపీ పార్టీ వల్ల బాలయ్య దూరంగా ఉంటున్నాడు. దీంతో ఈ వేడుక అంతా ఎన్టీఆర్ నాన్న హరికృష్ణ చుట్టూనే తిరగనుంది. ఆయన కుటుంబ సభ్యులు కూడా రానున్నారు. ఈ సినిమాను కూడా ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణతో పాటు నాన్నలందరికీ ఈ చిత్రం అంకితం అనే టైటిల్ ను జత చేస్తారని టాక్.
అయితే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తికి ఈ ఆల్బమ్ ని డెడికేట్ చేయనున్నారు. డైరెక్టర్ సుకుమార్, డీఎస్సీకి మధ్య ఉన్న బంధం గురించి చెప్పక్కర్లేదుa. త్వరలో ఆయన్ని ఏకంగా హీరోగా పరిచయం చేస్తూ సినిమా కూడా తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈమద్యే చనిపోయిన సత్యమూర్తి కి దీనిని అంకితం చేస్తే డీఎస్పీకి మరింత ఆనందంగా ఉంటుందని సుకుమార్ భావించాడు. పైగా ఆయన బాధలో ఉన్నా కూడా ఈసినిమా ను తొందరగా రిలీజ్ చేయాలి కాబట్టి మ్యూజిక్ చేసి పెట్టాడు. అందుకే నాన్నకు ప్రేమతో ఆడియో లో హీరో నాన్న ముఖ్య అతిథి అయితే సంగీత దర్శకుడి నాన్నకు ఈ ఆల్బమ్ అంకితం.
Post a Comment