సర్దార్ గబ్బర్ సింగ్ కంటే ముందుగానే వెండితెరపై..పవర్ స్టార్
పవర్ స్టార్ క్రేజ్ దృష్ట్యా ఈ మధ్య ప్రతీ సినిమాలో ఇటు హీరోలు, అటు దర్శకులు పవన్ నామజపం చేస్తున్నారు. దీంతో అసలు ఫ్యాన్స్ ఎవరో.. కొసరు ఫ్యాన్స్ ఎవరో తెలియక అయోమయంలో పడుతున్నారు అభిమానులు. అయితే నితిన్ మాత్రం పవన్ కు హార్డ్ కోర్ ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే. ఈ విషయం పవన్ సమక్షంలోని ప్రూవ్ చేసుకున్నాడు నితిన్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆ అనుబంధంతోనే నితిన్ సినిమాలో కనిపించబోతున్నాడట పవన్.
నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అ .. ఆ..’. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలోనే పవన్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నాడట. ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో బిజీగా వున్న పవన్… తీరిక చేసుకుని మరీ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించేందుకు అంగీకరించాడు అంటున్నారు.
పవన్ కు నితిన్ ఎంత ఫ్యానో… త్రివిక్రమ్ అంతకు మించిన స్నేహితుడు అన్న విషయం తెలిసిందే. ఓ వైపు అభిమాని.. మరోవైపు తాను అభిమానించే దర్శకుడు.. దీంతో ఈ ఇద్దరి కోసం పవన్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నాడు..! పైగా గతంలో త్రివిక్రమ్ కోసం మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సో ఇప్పడు పవన్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నాడన్నమాట. ఇదే నిజమైతే.. సర్దార్ గబ్బర్ సింగ్ కంటే ముందుగానే.. పవన్ ను వెండితెరపై చూసేయొచ్చు..!
Post a Comment