-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

May 11, 2016

ఈ ఫీచర్స్‌.. అదుర్స్‌ ...

 
రోజూ వాట్సప్‌ చూస్తాం. మెసేజ్‌లు పంపిస్తాం. కానీ అందులో ఇంకా ఏం ఫీచర్స్‌ ఉన్నాయో పట్టించుకోం. వాట్స్‌పలో చాలా మందికి తెలియని ఫీచర్స్‌ ఎన్నో ఉన్నాయి. అలాంటి కొన్ని ఫీచర్లు ఇవి...

పీడీఎఫ్‌ డాక్యుమెంట్‌ పంపాలంటే...

పీడీఎఫ్‌ డాక్యుమెంట్లను వాట్స్‌పలోనూ షేర్‌ చేసుకోవచ్చు. అయితే వాట్సప్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని ఉండాలి. ఆండ్రాయిడ్‌ ఉపయోగిస్తున్నట్లయితే వాట్సప్‌లో కుడివైపు కార్నర్‌లో ఉన్న అటాచ్‌మెంట్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు మీకు డాక్యుమెంట్‌, కెమెరా, గ్యాలరీ, ఆడియో, లొకేషన్‌, కాంటాక్ట్‌ అని కొన్ని ఐకాన్స్‌ కనిపిస్తాయి. వాటిలో మీరు పంపాలనుకుంటున్న పీడీఎఫ్‌ ఫైల్‌ ఎక్కడుందో బ్రౌజ్‌ చేసి సెలక్ట్‌ చేస్తే సరిపోతుంది.
 
డాటా సేవింగ్‌
మీ ఫోన్‌లో ఏ యాప్స్‌ డాటాను ఎక్కువగా వాడటం గమనించారా? సందేహం లేకుండా వాట్సప్‌ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ఇబ్బంది పోవాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి డాటా యూసేజ్‌ని ఎంచుకోండి. అందులో టైప్‌ ఆఫ్‌ మీడియా ఏది సెలక్ట్‌ చేసుందో చెక్‌ చేయండి. ఓన్లీ వైఫై లేక వైఫై, సెల్యూలార్‌ సెలక్ట్‌ చేసుందా చూడండి. ఒకవేళ రెండూ సెలక్ట్‌ చేసుంటే కనుక వైఫై ఒక్కదాన్నే ఎంచుకోండి. వాట్స్‌పకాల్‌లో డాటా యూసేజ్‌ తక్కువగా ఉండాలంటే లో డాటా యూసేజ్‌ని ఎనేబుల్‌లో పెట్టుకోండి.
 
ముఖ్యమైన మెసేజ్‌లకు స్టార్‌
ఎప్పుడో స్నేహితుడు పంపిన ముఖ్యమైన మెసేజ్‌ మళ్లీ చూడాలి. కానీ కొన్ని వందల మెసేజ్‌లు చేరిపోయాయి. వాటిలో వెతకాలంటే కష్టమే. అలాంటప్పుడు ముఖ్యమైన మెసేజ్‌లను సులభంగా గుర్తించడానికి మెసేజ్‌పై డబుల్‌ ట్యాప్‌ చేయాలి. తరవాత స్టార్‌ ఐకాన్‌తో మార్క్‌ చేయాలి. దీన్ని ఎప్పుడైనా వెతకాలంటే అన్ని మెసేజ్‌ల్లో చూడాల్సిన పనిలేకుండా స్టార్డ్‌ మెసేజ్‌ల్లో మాత్రమే వెతకొచ్చు. దీనివల్ల సులభంగా కావాల్సిన మెసేజ్‌ను సెర్చ్‌ చేసుకోవచ్చు.
 
స్టార్‌ మెసేజ్‌లన్నీ చూడాలంటే..
ముఖ్యమైన మెసేజ్‌లకు స్టార్‌ని ఎంపిక చేసుకుంటాం. అంతవరకూ బాగానే ఉంది. స్టార్‌ మెసేజ్‌లన్నింటిని ఒకే చోట చూడాలంటే కుడివైపు పైభాగంలో నిలువుగా ఉన్న త్రీడాట్స్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు స్టార్డ్‌ మెసేజెస్‌ అని ఒక ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే స్టార్డ్‌ మెసేజ్‌లన్నీ కనిపిస్తాయి.
 
బ్లూ టిక్స్‌ అదృశ్యం
మీరు పంపిన మెసేజ్‌లు చదివింది తెలుసుకోవడానికి బ్లూటిక్స్‌ ఉపయోగపడతాయి. అయితే వీటిని కనిపించకుండా చేసే మార్గం కూడా ఉంది. వాట్సప్‌లో త్రీడాట్స్‌ ఆప్షన్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌ని ఎంచుకోవాలి. ఇప్పుడు అకౌంట్‌పై ట్యాప్‌ చేసి ప్రైవసీలో ఉన్న రీడ్‌ రిసిప్ట్స్‌ బాక్స్‌ని అన్‌టిక్‌ చేయాలి. అయితే ఇతరులకు మీరు పంపిన మెసేజ్‌ చదివారా లేదా అనే విషయం కూడా తెలియకుండా పోతుంది.
 
వెబ్‌లో వాట్సప్‌
వాట్సప్‌ మెసేజ్‌లను ఎంతసేపు మొబైల్‌లోనే చదవాలంటే కష్టం. అలాంటప్పుడు పీసీకి కనెక్ట్‌ అయితే సరిపోతుంది. పీసీలోనూ వాట్సప్‌ మెసేజ్‌లు చదువుకోవచ్చు. ఇందుకోసం కుడివైపు పైభాగంలో నిలువుగా ఉన్న త్రీడాట్స్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు వాట్సప్‌ వెబ్‌ అని ఒక ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే వాట్స్‌పలో కెమెరా ఓపెన్‌ అవుతుంది. ఇప్పుడు పీసీలో వాట్స్‌ప.కామ్‌ని ఓపెన్‌ చేస్తే క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది. మొబైల్‌తో ఈ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే పీసీలో వాట్సప్‌ మెసేజ్‌లన్నీ కనిపిస్తాయి.
 
ప్రైవేట్‌ మెసేజ్‌
మీరు పంపే మెసేజ్‌ ఒక్కరికే చేరాలా? అయితే వాట్సప్‌ చాట్‌ విండోలో కుడివైపు కార్నర్‌లో ఉన్న త్రీడాట్స్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు న్యూ బ్రాడ్‌క్రాస్ట్‌ అని ఒక ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని టాప్‌ చేసి ఎవరికైతే మెసేజ్‌ పంపించాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్‌తో లిస్ట్‌ తయారుచేసుకోవాలి. అప్పుడు మీరు పంపించే మెసేజ్‌ వారికి మాత్రమే వెళుతుంది.
 
బ్యాకప్‌ కావాలంటే...
వాట్సప్‌లోనూ ముఖ్యమైన మెసేజ్‌లు వస్తుంటాయి. అలాంటి మెసేజ్‌లను సేవ్‌ చేసి పెట్టుకుంటే కావాలనుకున్నప్పుడు చూసుకోవచ్చు. అయితే సేవ్‌ చేయడం కన్నా బ్యాకప్‌ తీసుకోవడం బెటర్‌. ఎందుకంటే వాట్స్‌పలోని ప్రతి మెసేజ్‌ క్లౌడ్‌లో స్టోర్‌ అవుతుంది. ఐ ఫోన్‌ వినియోగదారులు ఆటోమెటిక్‌గా చాట్‌ హిస్టరీని బ్యాకప్‌ పొందవచ్చు. ఐక్లౌడ్‌ ఆటోమెటిక్‌గా రోజూ/వారం/నెల షెడ్యూల్‌లో హిస్టరీని బ్యాకప్‌ చేస్తుంది. మీరు ఎంపిక చేసుకున్న చాట్‌ హిస్టరీపై క్లిక్‌ చేసి ఈమెయిల్‌ కన్వర్జేషన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. ఆండ్రాయిడ్‌ వినియోగదారులైతే వాట్సప్‌ ఫోల్డర్‌లోనే ఫైల్‌ను గమనించవచ్చు. ఆ ఫైల్‌ను వాట్సప్‌ - డాటాబేసె్‌స-ఎమ్‌ఎ్‌సజీస్టోర్‌.డీబీ.సీఆర్‌వైపీటీ7లో పొందవచ్చు.
 
డాటా ఇలా...
ఫొటోలు పంపినపుడు డాటా ఎక్కువ ఖర్చవుతుంది. అలాంటప్పుడు సెట్టింగ్స్‌లోకి వెళ్లి చాట్‌ సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేయాలి. తరువాత అటో డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ను ఎంచుకుని సెట్టింగ్స్‌ను మార్చుకోవాలి. డాటాప్లాన్‌పై ఓవర్‌లోడ్‌ పడకూడదనుకుంటే వై-ఫైని ఎంచుకోవాలి. డౌన్‌లోడ్‌ ఆటోమెటిక్‌గా అయ్యే విధంగా మాన్యువల్‌గా క్లిక్‌ చేస్తేనే ఆయ్యేలా సెట్‌ చేసుకోవాలి.
 
చాట్స్‌ను మ్యూట్‌లో పెట్టొచ్చు
వాట్సప్ గ్రూప్‌లో ఉంటే కనుక మెసేజ్‌లు వెల్లువలా వచ్చిపడుతుంటాయి. అలాంటప్పుడు చాట్స్‌ను మ్యూట్‌లో పెట్టుకోవడం ద్వారా ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. ఏ గ్రూప్‌ను ఎంచుకుంటారనేది మీ ఇష్టం. మ్యూట్‌లో ఎనిమిది గంటలు, వారం, ఏడాదిపాటు పెట్టుకోవచ్చు. కావాలనుకున్నప్పుడు ఎగ్జిట్‌ కావచ్చు.
 
మెసేజ్‌ ఎప్పుడు చదివింది తెలుసుకోవాలంటే..
మీరు పంపిన మెసేజ్‌ ఏ సమయంలో చదివారో తెలియాలా? అయితే వాట్సప్‌ చాట్స్‌లోకి వెళ్లి, మీరు పంపించిన ఏదైనా ఒక మెసేజ్‌ని టాప్‌ చేసి హోల్డ్‌ చేయాలి. తరువాత ఇన్ఫో ఆప్షన్‌లోకి వెళ్లాలి. ఐఓఎస్‌ వినియోగదారులైతే ఎడమవైపు డ్రాగ్‌ చేసినట్లయితే ఒక విండో ఓపెన్‌ అవుతుంది. ఇందులో మీ మెసేజ్‌ ఎప్పుడు డెలివర్‌ అయింది. ఏ సమయంలో చదివారో తెలుసుకోవచ్చు. ఇది గ్రూప్‌ మెసేజ్‌ల విషయంలోనూ వర్తిస్తుంది. గ్రూప్‌లో ఒక్కో మెంబర్‌ మెసేజ్‌ చదివిన సమయం లిస్ట్‌ అవుతుంది.
 
పాపప్‌ నుంచి నేరుగా రిప్లై
వాట్స్‌పలో న్యూ మెసేజ్‌. నోటిఫికేషన్‌ బార్‌ స్వైప్‌ చేసి మెసేజ్‌ టైప్‌ చేసి రిప్లై ఇవ్వాలి. ఇలా కాకుండా సులభంగా రిప్లై ఇవ్వాలనుకుంటే సెట్టింగ్స్‌లో, నోటిఫికేషన్‌ ఆప్షన్‌లోకి వెళ్లి పాపప్‌ నోటిఫికేషన్‌పై క్లిక్‌ చేయాలి. ఇందులో మరో నాలుగు ఆప్షన్లుంటాయు. ఈ సెట్టింగ్స్‌ను మార్చుకోవడం ద్వారా నోటిఫికేషన్‌ నుంచి నేరుగా రిప్లై పంపుకోవచ్చు.
 
కన్వర్జేషన్‌ షార్ట్‌కట్స్‌
తరచుగా వాట్స్‌పలో చాటింగ్‌ చేసే వారు షార్ట్‌కట్స్‌ పెట్టుకోవడం బెటర్‌. షార్ట్‌కట్స్‌ పెట్టుకోవడానికి గ్రూప్‌ కానీ ఇండివిడ్యువల్‌ కానీ మీకిష్టమైన ఏదైనా చాట్‌ని టాప్‌ చేసి హోల్డ్‌ చేయాలి. ఇప్పుడు మరో విండో కనిపిస్తుంది. అందులో యాడ్‌ కన్వర్జేషన్‌ షార్ట్‌కట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు చాట్‌ క్వశ్చన్‌ కనిపిస్తుంది. మొబైల్‌ డెస్క్‌టా్‌పపై పర్సన్‌ ప్రొపైల్‌ ఫోటో మాదిరిగా కనిపిస్తుంది.





When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more  Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu