-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

May 11, 2016

సేఫ్‌గా ఆన్‌లైన్‌లోకి....?


ఇంటర్నెట్‌ అనేది నేడు సర్వసాధారణం అయిపోయింది. ఇక సోషల్‌ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. కోట్లాది మందిని వేళ్ల మీద ఆడిస్తోంది. వ్యక్తిగత జీవితాన్ని ఆన్‌లైన్‌కు సమర్పించిన వారు సెక్యూరిటీ విషయాన్ని మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నారు. ఫలితం.. ఫేస్‌బుక్‌ అకౌంట్‌ మొదలు.. బ్యాంక్‌ అకౌంట్‌ వరకు సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుతున్నాయి. అందుకే ఆన్‌లైన్‌లోకి ఎంటర్‌ అయ్యే ముందు సేఫ్టీ తప్పనిసరని హెచ్చరిస్తున్నారు ఐటీ నిపుణులు.
Visit::page::https://www.facebook.com/freshdeals365 
 సెక్యూర్‌ పాస్‌వర్డ్‌
క్యాపిటల్‌ లెటర్స్‌, స్మాల్‌ లెటర్స్‌, నెంబర్స్‌, స్పెషల్‌ క్యారెక్టర్స్‌.. ఇవన్నీ కలిగి ఉండే పాస్‌వర్డ్‌ సెక్యూర్డ్‌గా ఉంటుందని అందరికీ తెలుసు. పాస్‌వర్డ్‌ కనీసం 8 క్యారెక్టర్లకు మించి ఉండాలనీ తెలుసు. అయితే గజిబిజి పాస్‌వర్డ్‌ మనకెక్కడ గుర్తుంటుందని చాలామంది తేలికపాటి పాస్‌వర్డ్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంటిపేరు, పుట్టిన తేదీ, నచ్చిన హీరో పేరుతో సెక్యూరిటీ ఇచ్చేస్తున్నారు. పైగా ఏళ్ల తరబడి ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. సైబర్‌క్రైమ్స్‌ విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో సెక్యూర్డ్‌ పాస్‌వర్డ్‌ తప్పనిసరి.

2015లో మోస్ట్‌ కామన్‌ పాస్‌వర్డ్స్‌
‘123456’, ‘12345678’, "password' సెక్యూరిటీగా ఇలాంటి పాస్‌వర్డ్స్‌ ఎంచుకుంటున్నారు ఎందరో ఉన్నారని ఓ సర్వేలో తేలింది. ఇటువంటి తేలికపాటి పాస్‌వర్డ్స్‌ 20కి పైగానే ఉన్నాయి. సెక్యూర్డ్‌ పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి. మీ పాస్‌వర్డ్‌ ఎంత సెక్యూర్‌గా ఉందో చెక్‌ చేసుకోండి. www.howsecureismypassword.net వెబ్‌సైట్‌లో పాస్‌వర్డ్‌ స్ర్టెంగ్త్‌ చెక్‌ చేసుకోవచ్చు.

వెరిఫికేషన్‌
ప్రస్తుతం అన్ని మెయిల్‌ సర్వీసులు, సోషల్‌ నెట్‌వర్కులు టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ ఫాలో అవుతున్నాయి. గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యాహూ, యాపిల్‌ ఐక్లౌడ్‌.. ఇవన్నీ టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌ కలిగి ఉన్నవే. ఇది మీ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైనపుడు మీ మెయిల్‌కు అలర్ట్‌ మెసేజ్‌లు చేరవేస్తుంది.

డోన్ట్‌ రిప్లై
అనుమానస్పద వెబ్‌సైట్లు, అడ్ర్‌సల నుంచి వచ్చే మెయిల్స్‌కు రిప్లై ఇవ్వకపోవడం మంచిది. తలాతోకా లేని మెయిల్స్‌కు స్పందిస్తే చాలు హ్యాకర్లు మీ అకౌంట్లోకి వచ్చి చేరే ప్రమాదం ఉంది. అందుకే అనవసరమైన జంక్‌ మెయిల్స్‌కు స్పందించకుండా వాటిని ఎప్పటికప్పుడు డిలీట్‌ చేసేయండి.

రెస్పాన్సిబిలిటి
సోషల్‌ మీడియాలో ఎడాపెడా షేరింగ్‌ చేసేస్తుంటారు. అలాగే మీరు చేసే పోస్టింగ్‌లు కూడా మీకు తెలియని వ్యక్తులు షేర్‌ చేస్తుంటారు. దీనివల్ల మీ ప్రమేయం లేకుండానే మీ అకౌంట్‌ వివరాలు అపరిచితుల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. అందుకే ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ అకౌంట్లలో షేరింగ్‌ సెట్టింగ్స్‌ పక్కాగా ఉండేలా చూసుకోవాలి. మీ పోస్టింగ్‌లు షేర్‌ చేసే విషయంలో పరిధులు విధించండి. మీ ఫ్రెండ్స్‌తో కస్టమ్‌ లిస్ట్‌ ప్రిపేర్‌ చేసి.. కేవలం వారు మాత్రమే మీ
పోస్టింగ్‌లు షేర్‌ చేసేలా సెట్టింగ్స్‌ మార్చండి.

ఆన్‌లైన్‌ వేట
ఆన్‌లైన్‌లో తరచూ తారసపడే అపరచితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అన్‌నోన్‌ ఫోన్‌కాల్స్‌ విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటారో.. ఆన్‌లైన్‌లోనూ అంతే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారిని బ్లాక్‌ చేయడం సులభం. ప్రైవసీ సెట్టింగ్స్‌లో కొన్ని ఫీచర్స్‌ను యాక్టివేట్‌ చేస్తే ఆన్‌లైన్‌ స్టాకింగ్‌కు కళ్లెం వేయవచ్చు.

పొంచిఉన్న వైరస్‌లు..

మాల్‌వేర్‌: బ్రౌజింగ్‌ చేసే సమయాల్లో మాల్‌వేర్‌ దాడి చేస్తుంది. సరైన అవగాహన లేకుండా నెట్‌ సర్ఫింగ్‌ చేస్తున్నప్పుడు మాల్‌వేర్‌ మీ సిస్టమ్‌లోకి చొరబడుతుంది. బ్రౌజింగ్‌ సెషన్‌లోనూ కొన్ని పరిమితులు పాటించాలి.

టార్జన్‌ హార్స్‌: ఈ ప్రోగ్రామ్‌ వల్ల ఎలాంటి ఇబ్బందులు రావనుకుంటారు. కాకపోతే.. బ్యాక్‌డోర్‌ యాక్టివిటీ్‌సపై టార్జన్‌ హార్స్‌ ప్రభావం పడుతుంది.

స్పైవేర్‌: ఆన్‌లైన్‌ యాక్టివిటీస్‌ చేస్తున్నప్పుడు స్పైవేర్‌ ప్రమాదం పొంచి ఉంటుంది. ఆన్‌లైన్‌ జోరులో మీరుండగానే.. మీ పర్సనల్‌ డాటా అంతా ఇది కలెక్ట్‌ చేస్తుంది.

సైబర్‌ క్రిమినల్స్‌: హ్యాకర్స్‌కు టెక్నాలజీలో లోతైన పరిజ్ఞానం ఉంటుంది. బడాబడా కంపెనీలు సైతం హ్యాకర్స్‌ బెడద నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంటాయి. హ్యాకర్స్‌కు చెక్‌ పెట్టడం కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అంతగా లేనివారికి అసాధ్యమే. అయితే పాస్‌వర్డ్‌ విషయంలో పూర్తి సెక్యూర్డ్‌గా ఉండగలిగితే.. సైబర్‌ దాడుల నుంచి కొంత తప్పించుకునే వీలుంది.

తస్మాత్ జాగ్రత్త
పెద్ద నగరాల్లో చాలా ఇళ్లలో వైఫై రూటర్స్‌ కొలువుదీరుతున్నాయి. ఎదురింటివారు, పక్కింటివారు అడిగారు కదా అని మీ వైఫై పాస్‌వర్డ్‌ చెప్పేయకండి. అంతగా వారికి అవసరం ఉంటే.. మీ ఇంటికే వచ్చి కంప్యూటర్‌లో సమాచారం తీసుకోండని ఆఫర్‌ చేయండి. ఇరుగుపొరుగు వారైనా.. సెక్యూరిటీ పాస్‌వర్డ్‌ లీక్‌ చేయడం శ్రేయస్కరం కాదు. వారు ఎలాంటి ఏవైనా ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌ చేస్తే.. ఆ ప్రభావం ముందుగా పడేది మీ మీదే అని గుర్తుంచుకోండి.




When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu