-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

April 02, 2016

పవన్ ఇంటిముందు ధర్నా చేసే వాళ్లలో నేనే మొదటివాడిని- బాబీ

freshdeals365.com

పరిశ్రమకొచ్చి పదేళ్లవుతోంది. ఓ మాస్‌ సినిమా తీసి శభాష్‌ అనిపించుకున్నాడు. అదే సమయంలో అభిమాన హీరో నుంచి పిలుపొచ్చింది. ఎవరైనా ఏమనుకుంటారు. ‘నా సినిమా నచ్చి ప్రశంసించడానికి పిలచారేమో’ అనుకుంటారు. ఇదే ఆలోచనతో కొన్ని నెలల క్రితం పవన్ కల్యాణ్‌ దగ్గరకు వెళ్లాడు బాబీ. ‘పవర్‌’ హిట్‌ అయిందని భుజం తట్టి అభినందిస్తాడు అనుకుంటే... భుజమైతే తట్టాడు... ఆ తర్వాత అన్న మాటతో చిన్న సైజ్‌ తుఫాన్ రేపాడు బాబీ గుండెల్లో. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’కు నువ్వే దర్శకుడివి అంటూ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడు. ఇంత జరుగుతున్నా బాబీ కల ‘పవన్‌తో ఫోటో’ ఎప్పుడా అని చూశాడు. అలాంటి షాక్‌ నుంచి తేరుకోవడం కష్టమే. కానీ తేరుకున్నాడు. పవన్‌తో సర్దార్‌ వేషం వేయించాడు. పవన్‌తో ఏ స్థాయి అభిమానంలో ఉన్నాడంటే.. ‘పవన్ సినిమాల నుంచి తప్పుకుంటాను అంటే... ఇంటి ముందు కూర్చోని ధర్నా చేసేవాళ్లలో మొదటివాడిని నేనే అంటున్నాడు బాబీ. పవన్ కల్యాణ్‌ కథానాయకుడిగా ఆయన దర్శకత్వం వహించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ విషయాలు ఆయన మాటల్లోనే... 

నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘పవర్‌’ 2014 సెప్టెంబర్‌లో విడుదలైంది. అదే ఏడాది నవంబర్‌లో ‘పవన్ కల్యాణ్‌గారు మాట్లాడతానంటున్నారు’ అంటూ శరత్‌మరార్‌గారి నుంచి ఫోన్ వచ్చింది.ఫామ్‌హౌష్‌లో మొక్కలు నాటుతున్న కల్యాణ్‌గారు ‘సర్దార్‌’ సినిమాకు నువ్వే దర్శకుడివి అనగానే అదొక కలగా అనిపించింది. అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే వరకు కూడా నమ్మసఖ్యంగా భావించలేదు. అప్పుడు కూడా నా ఆలోచన ఆయనతో ఫోటో దిగాలనే. తర్వాత స్ర్కిప్ట్‌ పనులు మొదలుపెట్టాం. ఆయన ఇచ్చిన కథను అడాప్ట్‌ చేసుకోవడానికి 5 నెలల సమయం పట్టింది. ‘గబ్బర్‌సింగ్‌’ అనేది స్పాన్ ఉండి సూపర్‌హిట్‌ అయిన సినిమా. కథ వేరైనా గబ్బర్‌సింగ్‌ టైటిల్‌తో వస్తుండడం జనాల్లో భారీ అంచనాలుంటాయి. దానికి మించి ఈ సినిమా ఉండాలని నేను కూడా కథ మీద చాలా వర్క్‌ చేశాను. గతేడాది ఏప్రిల్‌లో షూటింగ్‌ మొదలుపెట్టాం. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేస్తున్నాం. ఈ సినిమా ఓకే అయిన వెంటనే నేరుగా రవితేజగారి దగ్గరికి వెళ్లి ఈ శుభవార్త చెప్పాను. సొంత అన్నలాగా ఆయన ఆనందపడ్డారు. తర్వాత నా భార్యకు చెప్పా. 

రచయితగా హెల్ప్‌ చేశారు..
ఈ సినిమా కథ కల్యాణ్‌గారిదే కాబట్టి రైటర్‌గా ఆయన చాలా ఇన్‌పుట్స్‌ ఇచ్చారు. అవన్నీ నేను పాటించా. సినిమా చిత్రీకరణ, డైరెక్షన్‌లో ఆయన ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉందనే వార్తలొస్తున్నాయి. అవన్నీ వాస్తవాలు కాదు. కల్యాణ్‌గారు ఎంతో స్వేచ్ఛనిచ్చి పని చేయించారు. రచయితగా నాకెంతో హెల్ప్‌ చేశారు. దర్శకత్వం, ఫోటోగ్రఫీ సైడ్‌ ఆయన అస్సలు టచ్ చేయలేదు. నా వేవ్‌ లెంగ్త్‌ మ్యాచ్ కాకపోతే నన్ను భరించాల్సిన అవసరం ఆయనకు లేదు. నా పనితీరు నచ్చకపోతే వెంటనే వేరే నిర్ణయం తీసుకునేవారు. 

పూర్తిగా వినోదాత్మకం...
సినిమా కథేంటి అనేది ట్రైలర్‌ రూపంలో చెప్పేశాం. రెండున్నర గంటల సినిమాలో వేరే సీన్స్‌తో ట్రైలర్‌ కట్‌ చేయోచ్చు కానీ సినిమా మెయిన్ థీమ్‌ ఏంటనేది ముందుగానే ప్రేక్షకులకు తెలియాలి. లోపలి ఏముంది అనేది సినిమా చూశాక తెలియాలి అని పవన్‌కల్యాణ్‌గారే ట్రైలర్‌ రూపంలో కథ చెప్పించారు. ఆ ట్రైలర్‌ చూసి ఎంతో థ్రిల్‌ ఫీలవుతున్నారు. సినిమా పూర్తిస్థాయి వినోదాన్ని పంచుతుంది. ఆయన సినిమాల్లో ఫైట్లు సహజంగా ఉంటూనే మాంచి కిక్‌ ఇస్తాయి. ఆ తరహాలోనే కొత్తగా ట్రై చేశాం. వినోదం, పోరాటాలు, పాటలు, సంభాషణలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ఇందులో ఏదొక సన్నివేశంలో చిరంజీవిగారిని టచ్ చేయాలన్నది కల్యాణ్‌గారి ఆలోచన. అందుకే ఎంతో పాపులర్‌ సాంగ్‌ అయిన వీణా స్టెప్‌ను ఇందులో కల్యాణ్‌గారు ట్రై చేశారు. పొలిటికల్‌ డైలాగ్‌లేమీ ఈ సినిమాలో ఉండవు. ఆయన పార్టీకి లీడర్‌ కాబట్టి జనాలు అలా రిసీవ్‌ చేసుకునే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే గతేడాది ఏప్రిల్‌ నుండి ఆడుతూపాడుతూ షూటింగ్‌ చేశాం. ‘అభిమానులు రెండేళ్లగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టంలేదు. ఏప్రిల్‌కి మనం ఎందుకు విడుదల చేయలేం’ అని పవన్‌ కల్యాణ్‌ అడిగారు. మా అందరికీ ఫుల్‌ టెన్షన్. అప్పటికీ మేజర్‌ పార్ట్‌ అస్సలు టచ్ చేయలేదు. జనవరి మధ్య నుంచి సీరియస్‌గా షూటింగ్‌ చేయడం మొదలుపెట్టాం. రాత్రింబవళ్లు పనిచేసి సినిమా పూర్తి చేశాం. 

పసి హృదయం ఆయనది...
కల్యాణ్‌గారితో పనిచేయడం అంత సులభం కాదు. ఆయనతో కలిసి పనిచేశాక నాలో సహనం పెరిగింది. ఆయన్ను తట్టుకుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఆయన పొగడ్త, మనిషికి ఆయనిచ్చే విలువ, ప్రశంస ఎలాంటి వ్యక్తికైనా మంచి బలాన్నిస్తుంది. పొద్దున్నుంచీ సెట్‌లో వర్క్‌ చేసి సాయంత్రం పేకప్‌ చెప్పాక ఆయన తీరే వేరుగా ఉంటుంది. పసిపిల్లాడిలా మారిపోతారాయన. ఒక పని చేయాలంటే చుట్టూ ఉన్న అందరి సలహా తీసుకుంటారు. ఈ సినిమాను హిందీలో విడుదల చేయాలన్నది ఆయన ఐడియానే. సినిమా పట్ల ఈరోస్‌ సంస్థ చాలా హ్యాపీగా ఉన్నారని శరత్‌గారు చెప్పారు. 

మరువలేని ప్రశంస...
సినిమాలు చేస్తూ కూడా ఆయన ప్రజల గురించి సమాజ సేవ గురించి ఆలోచిస్తుంటారు. మల్టీటాలెంటెడ్‌ పర్సనాలీటి ఆయన. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. చిరంజీవిగారు మా సెట్‌కి వచ్చినప్పుడు ‘అన్నయ్య బాబీ చాలా బాగా డైరెక్ట్‌ చేస్తున్నాడు. భవిష్యత్తులో మంచి దర్శకుడవుతాడు. కుదిరితే నువ్వు కూడా అతనితో ఓ సినిమా చెయ్యి’ అని చెప్పారట. రెండో సినిమాకే ఇంతకన్నా ప్రశంస ఇంకేముంటుంది చెప్పండి. అది ఎప్పటికీ మరువలేని ప్రశంస. 

నెల రోజులు హాలీడే...
బోర్‌ కొట్టే వరకు నా నుంచి కామెడీ, మాస్‌ సినిమాలే వస్తాయి. ప్రజెంట్‌ రెండు కథలున్నాయి. ఈ సినిమా విడుదల తర్వాత నెల రోజులు హాలీడే తీసుకుంటాను. నా భార్యకోసం సమయం కేటాయిస్తా.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu