-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

April 02, 2016

యాప్‌తో ఆరోగ్యమస్తు ...?

freshdeals365.com

పని ఒత్తిడిలో పడి మహిళలకు ఆరోగ్యం గురించి ఆలోచించే సమయం లేకుండా పోతోంది. అలాంటి మహిళలను కంటికి రెప్పలా కాపాడేందుకు కొన్ని యాప్స్‌ ఉన్నాయి. ఇవి ఉంటే తన గురించి కూడా కాసేపు ఆలోచించుకునే అవకాశం లభిస్తుంది. ఆ విశేషాలు ఇవి.

ది పిల్‌ 
కాల్షియం మాత్రలు, బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌, విటమిన్‌ డి, ఐరన్‌ మాత్రలు.. ఇలా అనేక రకాల మందులను మహిళలు క్రమం తప్పకుండా వేసుకోవాల్సి ఉంటుంది. అయితే పని ఒత్తిడి మూలంగా సమయానికి వేసుకోవడం మరచిపోతుంటారు. ఇలాంటి వారి కోసం ‘ది పిల్‌’ యాప్‌ బాగా ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని ఏ సమయానికి మాత్రలు వేసుకోవాలో టైమ్‌ సెట్‌ చేసుకుంటే చాలు. ఆ సమయానికి మాత్ర వేసుకోవాలని యాప్‌ మీకు గుర్తు చేస్తుంది. ఈ యాప్‌ను ఉపయోగించడం చాలా సులభం. ఇది తోడుంటే మందులు వేసుకోవడం మరచిపోవడం అంటూ జరగదు. నోటిఫికేషన్‌ రూపంలో తెలియజేస్తుంది. మీకిష్టమైన సౌండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

యోగా స్ట్రెచ్ 
మీకు యోగా చేయడం ఇష్టమా? అయితే ఈ యాప్‌ మీకోసమే. రకరకాల యోగాసనాలు, ప్రీలోడెడ్‌ మ్యూజిక్‌తో లభిస్తాయి. యోగాని ఇష్టపడే ప్రతి మహిళా తన స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోదగిన యాప్‌ ఇది. ఆండ్రాయిడ్‌ వినియోగదారులైతే డైలీ యోగా యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. అన్ని వయసుల వారికి ఉపయోగకరంగా ఉంటుంది.

మైఫిట్‌నెస్‌ 
ఫిట్‌నె్‌సకున్న ప్రాధాన్యం తెలిసిందే. నాజూకైన సౌందర్యం కావాలంటే ఫిట్‌నెస్‌ గురించి ఆలోచించక తప్పదు. జిమ్‌కు వెళ్లడం, వర్కవుట్స్‌ చేయడం, వాకింగ్‌ చేయడం రోజు వారి దినచర్యలో భాగం కావాలి. అయితే ఫిట్‌నె్‌సను ట్రాక్‌ చేయాలంటే యాప్‌ ఉండాల్సిందే. డైట్‌ను ట్రాక్‌ చేయడంతో పాటు క్యాలరీలను లెక్కించాలి. రోజు ఏం తింటున్నారు, ఎంత సేపు వ్యాయామం చేస్తున్నారు. ఈ వివరాలన్నీ ‘మైఫిట్‌నెస్‌’ యాప్‌తో ట్రాక్‌ చేయవచ్చు. ఫిట్‌నె్‌సకు ప్రాధాన్యం ఇచ్చే మహిళలు ఎంచుకోదగిన యాప్‌ ఇది.

వెబ్‌ఎండి 
లక్షణాలను గుర్తించడం, మందులు, చికిత్స, ఫస్ట్‌ ఎయిడ్‌ ఇన్‌ఫర్మేషన్‌.. వంటి వివరాలన్నీ ఇందులో లభిస్తాయి. లక్షణాల ఆధారంగా ఏ సమస్యతో బాధపడుతున్నారో తెలుసుకోవచ్చు. కారణాలు, చికిత్స వివరాలు తెలుసుకోవచ్చు. పోషకాహార లోపం, సైడ్‌ఎఫెక్ట్‌ల వివరాలు కనుక్కోవచ్చు. దగ్గరలో ఉన్న ఆసుపత్రులు, ఫిజిషియన్లు, ఫార్మసీల వివరాలు తెలుసుకోవచ్చు.

హెల్త్‌ వర్కవుట్స్‌ 
మైఫిట్‌నె్‌సపాల్‌ మాదిరిగా ఇది కూడా అద్భుతమైన యాప్‌. కొవ్వును ఎలా కరిగించుకోవాలో తెలిపే టూల్స్‌ ఇందులో ప్రత్యేకం. ఇందులో 130 రకాలకు పైగా వ్యాయామాలున్నాయి. మెల్ట్‌ఫ్యాట్‌, గెట్‌ కిల్లర్‌ కర్వ్స్‌, లోయర్‌ బాడీ బ్లాస్ట్‌, మాస్టర్‌ పుషప్స్‌, టైటన్‌, టోన్‌, టోటల్‌ బాడీ టోనప్‌ వంటి వర్కవుట్స్‌ ఉంటాయి. ఫిట్‌నెస్‌ గోల్స్‌ను చేరుకోవడానికి ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన యాప్‌ ఇది. మెటబాలిజంను బూస్ట్‌ చేస్తుంది. స్టెప్‌ బై స్టెప్‌ ఇన్‌స్ట్రక్షన్‌ లభిస్తుంది. వర్కవుట్లు చేసే సమయంలో మీ రెప్స్‌ను రికార్డు చేసుకోవచ్చు. ప్రివ్యూ సెషన్లు చూడవచ్చు. వాటిని మెయిల్‌ చేసుకోవచ్చు.

పీరియడ్‌ ట్రాకర్‌ 
పీరియడ్స్‌ ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉందో తెలుసుకోవాలంటే ‘పీరియడ్‌ ట్రాకర్‌’ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిందే. ఇది కచ్చితమైన సమయాన్ని సూచిస్తుంది. లక్షణాలను ట్రాక్‌ చేయడంలోనూ ఉపయోగపడుతుంది.

బేబీ స్టెప్స్‌ 
మహిళ జీవితంలో సంతోషకరమైన సమయం ఏంటంటే ప్రెగ్నెన్సీ అని చెప్పక తప్పదు. బేబీ ఏ వారంలో ఎలా ఉంటుంది? ఎలా పెరుగుతుంది? ఏ వారంలో ఎంత అభివృద్ధి జరుగుతుంది? ఇలాంటి విషయాలన్ని తెలుసుకోవాలని ఉంటుంది. ఇందుకోసం ‘బేబీ స్టెప్స్‌’ యాప్‌ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

గ్లో 
కొందరు సీ్త్రలను సంతానలేమి వేధిస్తుంటుంది. అలాంటి వారికి ‘గ్లో’ యాప్‌ ఉపకరిస్తుంది. డాక్టర్‌ సలహా లేకుండా మ్యాజిక్‌ వేలో కన్‌సీవ్‌ అయ్యేలా చేస్తుంది. అండాల విడుదల, పీరియడ్స్‌, మూడ్‌, లక్షణాలు, సెక్స్‌ లైఫ్‌, మందులు ఇలా ప్రతి అంశాన్ని రికార్డు చేస్తుంది. వీటి ఆధారంగా ఫెర్టిలిటీని అంచనా వేస్తుంది. వర్త్‌ఫుల్‌ యాప్‌ అనడంలో సందేహం లేదు.

ఒత్తిడి, ఆందోళన 
మహిళలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంటిపని, ఆఫీసుపనితో సతమతమయ్యే మహిళల్లో ఒత్తిడి, ఆందోళన కాస్త ఎక్కువే. మరి ఒత్తిడి నుంచి బయటపడాలంటే రిలాక్సేషన్‌ను అందించే యాప్‌ ఉండాల్సిందే. ఇందులో ఉండే బ్రీతింగ్‌ వ్యాయామాలు, మెడిటేషన్‌, ఆహ్లాదాన్ని అందించే సంగీతం మైండ్‌, బాడీని రిలాక్స్‌ చేస్తాయి. సె్ట్రస్‌ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుకున్నప్పుడే గుండె జబ్బులు, క్రానిక్‌ డిప్రెషన్‌, కేన్సర్‌ వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

విమెన్‌ హెల్త్‌ డైరీ 
కాంప్రహెన్సివ్‌ సూట్‌ ఇది. ఇందులో అనేక రకాల యాప్స్‌ ఉంటాయి. బీఎమ్‌ఐ(బాడీ మాస్‌ ఇండెక్స్‌) తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయాలనుకుంటే అందుకు ప్రత్యేకమైన యాప్‌ ఉంటుంది. మీకు ఎన్ని క్యాలరీలు అవసరమో తెలుసుకోవాలంటే దానికి మరో యాప్‌ లభిస్తుంది. రోజూ తీసుకోవాల్సిన క్యాలరీలను ట్రాక్‌ చేసే యాప్‌ కూడా ఉంటుంది.
మెనుసు్ట్రవల్‌ డైరీ యాప్‌, ఇమ్యునైజేషన్‌, హెల్త్‌ స్ర్కీనింగ్‌ యాప్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రతి మహిళ స్మార్ట్‌ఫోన్‌లో ఉండదగిన హెల్త్‌డైరీ ఇది.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu