థింక్ షార్ప్ ఫౌండేషన్ స్థాపకులైన సంతోష్ దిగంబర్‌రావ్ ఫాద్ స్టడీమాల్స్ అనే ఇంటరాక్టివ్ లైబ్రరీ్‌సను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తున్నారు. ఇవి దేశంలోని గ్రామీణ విద్యార్థులను డిజటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతాయని ఆయన అంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
లలితకు ఏడేళ్లు. తనకు పైలెట్ కావాలని కోరిక. ఆ చిన్నపాపకు తెలుసు విమానాలు పైకి ఎగురుతాయని కానీ అలా విమానాన్ని నడపాలంటే ఏం చేయాలి అన్న విషయం మటుకు లలితకు తెలీదు. సంతోష్ ఏర్పాటుచేసిన స్టడీమాల్‌కు వచ్చిన లలితకు బయట ప్రపంచంతో పాటు, తన కలను నెరవేర్చుకునే గమ్యం తెలిసింది. ఆ దిశగా లలిత ఇప్పటి నుంచే తన కెరీర్‌ను మలుచుకుంటుంది.
డిజిటల్ సాధికారతకోసం...
దేశంలోని మారుమూల గ్రామాల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటుచేయాలన్నది మహారాష్ట్రకు చెందిన సంతోష్ ఆలోచన. ఆలస్యం చేయకుండా మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆ పనిని ప్రారంభించారాయన. విద్యారంగంలో డిజిటల్ సాధికారత సాధించడమే స్టడీమాల్స్ లక్ష్యం. 2011 నుంచి ఆ దిశగా సంతోష్ కృషి చేస్తున్నారు. సంతోష్ ఎంబిఎ చేశారు. ఓ ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తూనే స్టడీమాల్స్ కోసం కృషి చేస్తున్నాడు. తన ఊరులోని స్కూళ్ల పరిస్థితి, అక్కడి పిల్లలు చదువులో వెనుకబడి ఉన్న తీరు చూసి తీవ్రంగా మదనపడ్డారు. ఒకవైపు పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లు మంచి ప్రమాణాలతో, డిజిటల్ నాలెడ్జ్‌తో ముందుకుపోతుంటే గ్రామాల్లోని స్కూళ్లల్లో ఆ పరిస్థితి లేకపోడడం అతడ్ని నిరుత్సాహపరిచింది.
చదువు మీద ఆసక్తి లేకపోవడం వల్ల గ్రామాల్లో బడికి హాజరవుతున్న పిల్లల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటోందని గమనించారు. అప్పుడే పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లకు గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా థింక్ షార్ప్ ఫౌండేషన్ ఏర్పరిచారు. దాని ద్వారా గ్రామాలలో స్టడీమాల్స్ అనే వినూత్న కాన్సెప్టును ప్రారంభించారు. ఇదొక లైబ్రరీ. ఇందులో నాణ్యమైన విద్యను నేర్పే మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులో ఉంటాయి.
పుస్తకాలు, ఎడ్యుకేషనల్ గేమ్స్, బొమ్మలు, కంప్యూటర్ లర్నింగ్, డిజిటల్ లేదా మల్టీమీడియా లర్నింగ్, వివిధ అంశాల మీద వర్కుషాపులు నిర్వహించడం వంటివి ఉంటాయి. స్టడీమాల్స్ నిర్వహణ పరంగా సంతోష్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నిధుల లేమి అతనికి పెద్ద సమస్యగా ఉండేది. జల్నాలోని సురన్‌గలి గ్రామంలో ఇలాంటి ఒక సెంటర్‌ను మొదలెట్టడానికి కావాల్సిన 70,000 రూపాయలను సేకరించడానికి సంతో్‌షకు రెండు సంవత్సరాలు పట్టింది. అనేక ఇబ్బందులు పడ్డా తర్వాత క్రౌడ్‌ఫండింగ్ అవకాశాలు మెరుగుపడ్డాయి.
మహారాష్ట్ర గ్రామాల్లో...
విద్యాపరంగా ఎంతో వెనుకబడ్డ సురన్‌గలి గ్రామంలోని ఒక అద్దె ఇంట్లో 2013లో తొలి ప్రాజెక్టు ప్రారంభమైంది. కంప్యూటర్ పరిజ్ఞానమున్న వ్యక్తిని వలంటీర్‌గా తీసుకున్నారు. ఆ వలంటీర్ డిజిటల్ సాధనాల ద్వారా పిల్లలకు ఇంటరేక్టివ్ లర్నింగ్ నేర్పిస్తారు. మరి కొద్దికాలంలోనే జల్‌గాన్‌లోని వరంగాన్ గ్రామం బడి ప్రాంగణంలోను, థానెలోని వంగని గ్రామంలోను డిజిటల్ సెంటర్లను ప్రారంభించారాయన. ఈ ఇంటరాక్టివ్ స్టడీ లైబ్రరీలు మూడు గ్రామాల్లోని 1500 మంది పిల్లలపై అనూహ్యమైన ప్రభావాన్ని చూపాయి.
ఈ పిల్లలంతా వ్యవసాయ కుటుంబాలకు చెందినవాళ్లు. ‘వీటిని నిర ్వహించేటప్పుడు కొన్నిసార్లు మా సెంటర్‌లో ఎలకి్ట్రసిటీ ఉండేది కాదు అలాంటి సమయాల్లో మేము సోలార్ దీపాలను పెట్టి పిల్లలకు విద్యను బోధించేవాళ్లం. పిల్లలు సెంటర్‌లో చదువుతూ ఆడుకుంటారు. ఆడుకుంటూ చదువుతారు’ అని సంతోష్ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఔరంగాబాద్‌లోని చికాట్‌గాన్‌లో కొత్త సెంటర్‌ను ప్రారంభించే ఆలోచనల్లో ఉన్నారు.
భారతదేశంలోని అన్ని గ్రామాల్లో స్టడీమాల్స్‌ను ప్రారంభించాలన్నదే సంతోష్ కల. ఇందుకోసం కార్పొరేట్, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల నుంచి సహాయం కోరుతున్నారు. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో సంవత్సరానికి మూడు నుంచి నాలుగు స్టడీ మాల్స్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రస్తుతమున్న అన్ని సెంటర్లలో కాంప్రహెన్సివ్ డిజిటల్ లర్నింగ్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేయాలని కూడా సంతోష్ అనుకుంటున్నారు. సంతోష్ తన లక్ష్యాన్ని సాధిస్తారని ఆశిద్దాం.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.
Post a Comment