-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

April 10, 2016

యోగాతో దృఢమైన జుట్టు



అందమైన జుట్టు ఉండాలని కోరుకోని వారు ఎవరుంటారు. మరి ఆరోగ్యమైన జుట్టు కావాలంటే రోజూ యోగా చేయండి. చాలా మంది జుట్టు సంరక్షణ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ శారీరక ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోరు. నిజానికి జుట్టుకు శారీరక ఆరోగ్యానికి సంబంధం ఉందని అంటున్నారు వైద్యులు. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని, ఒకవేళ జుట్టు రాలుతున్నా, చిట్లుతున్నా అనారోగ్యం ఉన్నట్లుగా భావించవచ్చని వారు అంటున్నారు. సాధారణంగా జుట్టు రాలడానికి కారణాలు అనేకం ఉంటాయి. ఒత్తిడి, హార్మోన్ల సమస్యలు, ఆహారపు అలవాట్లు, మందులు, హెయిర్‌కలర్స్‌, వంశపారంపర్యంగా సంక్రించే వ్యాధులు, ఇతర సమస్యలు...ఇవన్నీ జుట్టుపై ప్రభావం చూపిస్తుంటాయి. అయితే ఈ సమస్యలకు చెక్‌పెట్టి ఆరోగ్యవంతమైన జుట్టు సొంతం చేసుకోవాలంటే యోగా ఇందుకు చక్కగా ఉపయోగపడుతుందని అంటున్నారు వారు.

                   యోగా చేయడం ద్వారా ఆరోగ్యమైన జుట్టును సొంతం చేసుకోవడమే కాకుండా మొత్తం శరీరవ్యవస్థకు శారీరకంగా, మానసికంగా లాభం చేకూరుతుందట. యోగా వల్ల తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. జీర్ణశక్తి పెంపొందుతుందని అంటున్నారు యోగా నిపుణులు. ఒకవేళ జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే అధో-ముఖ శవాసన, ఉత్తానాసన, వజ్రాసన, ఆపానాసన, పవనముక్తాసన, సర్వాంగాసన, కపాలభాతి ప్రాణాయామం, భస్ర్తిక ప్రాణాయామం, నాడీ శోధన ప్రాణాయామం వంటివి మంచి ఫలితాలనిస్తాయని వారు సూచిస్తున్నారు. అయితే యోగాసనాలు చేయడంతో పాటు ఆహార నియమాలు పాటించడం అవసరమంటున్నారు. తాజా పండ్లు, ఆకుకూరలు, ధాన్యాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం, జుట్టుకు నిమ్మ రసం పెట్టుకుని స్నానం చేయడం, కొబ్బరినూనెతో మసాజ్‌ చేయడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చని అంటున్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu