ముంబై: వరల్డ్ టీ 20 వరకూ టీమిండియా క్రికెట్ జట్టు డైరెక్టర్ గా కొనసాగిన రవిశాస్త్రికి కోచ్ గా బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. డైరెక్టర్ గా రవిశాస్త్రికి మంచి మార్కులు లభించడంతో కోచ్ పదవినికి కూడా అతనికే ఇవ్వాలని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్లతో కూడిన ఉన్నత స్థాయి క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) కూడా రవిశాస్త్రి వైపే మొగ్గు చూపినట్లు బోర్డు వర్గాలు సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనిలో భాగంగా ఈ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఆటగాళ్లతో సమావేశమైన అనంతరం రవిశాస్త్రి కోచ్ పదవిపై నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
టీమిండియా జట్టులో అధికశాతం మంది ఆటగాళ్లు రవిశాస్త్రితో కలిసి పనిచేయడాకి మద్దతు తెలిపారు. మళ్లీ రవిశాస్త్రితో కలిసి పని చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని సీనియర్ ఆటగాళ్లు సైతం పేర్కొనడంతో అతని కోచ్ పదవి దాదాపు ఖాయమైనట్లే కనబడుతోంది. దీనిపై బీసీసీఐ అధికార ప్రకటన మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.
భారత క్రికెట్ జట్టు తన టెస్టు సిరీస్ లో భాగంగా వచ్చే జూలైలో వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో కోచ్ పదవిపై తొందరగా నిర్ణయం తీసుకంటేనే మంచిదని బీసీసీఐ యోచిస్తోంది. ఈ పదవికి తొలుత టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పేరును బోర్డు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే ద్రవిడ్ ప్రస్తుతం భారత్-ఎ, అండర్-19 జట్లకు చీఫ్ కోచ్ గా ఉన్నాడు. దీంతో పాటు అత్యున్నత స్థాయి బాధ్యతలు స్వీకరించేందుకు కావాల్సినంత సమయం కావాలని ద్రవిడ్ సందిగ్దత వ్యక్తం చేయడంతో బోర్డు పునరాలోచనలో పడింది. దీనిలో భాగంగానే అంతకుముందు జట్టు సభ్యులతో కలిసి పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న రవిశాస్త్రిని చీఫ్ కోచ్ గా నియమిస్తే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.
Post a Comment