సొంతంగా ఓ కారు ఉండాలని, అందులో షికారుకెళ్లాలని చాలా మందికి కోరిక ఉంటుంది. ఆర్థిక స్థోమత కారణంగా అందరికీ ఇది సాధ్యంకాకపోవచ్చు. కాస్త తక్కువ బడ్జెట్ లోనే కారులో విహారయాత్రకు వెళ్లాలనుకునేవారికో శుభవార్త.
4 వేల రూపాయలతో వారం రోజులపాటు కారును అద్దెకు ఇచ్చి ఎంచక్కా ఎంజాయ్ చేయమంటున్నారు జస్ట్‌రైడ్ సంస్థ వాళ్లు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ కారును వాడుకోవచ్చు. ‘ఉబిక్’ అనే పేరుతో దీనిని 2015 ఆగస్టులో బెంగళూరులో ప్రారంభించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు, సొంతంగా కారు కొనుక్కునే స్థోమత లేని వారు ఈ అద్దె కార్లను వినియోగించుకోవచ్చు. ఈ సంస్థ 125 కార్లతో 60 వేలకు పైగా కస్టమర్లతో కళకళలాడుతోంది. నగరంలో 10 చోట్ల సంస్థ ఆఫీసులున్నాయి. ఇవికాక దేశవ్యాప్తంగా ముంబై, పుణె, ఢిల్లీలలో వీటికి బ్రాంచ్‌లున్నాయి.
కారును అద్దెకు తీసుకునే ముందు రూ.999 ని డిపాజిట్ చేయాలి. కారును తిరిగి ఇచ్చేటప్పుడు ఈ మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. ప్రధానంగా సెల్ఫ్‌డైవ్ కే ప్రాధాన్యం ఇస్తామని సంస్థ నిర్వాహకులు చెప్పారు. కస్టమర్లు ప్రతివారం తమకిష్టమైన కార్లను తీసుకెళ్లే సౌకర్యాన్ని కల్పించారు. హోం డెలివరీ, అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల ఆప్షన్స్ వంటివి ప్రవేశపెట్టారు. ఇవేకాక కార్లలో ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం(ఏబీఎస్) వంటి సౌకర్యాలున్నాయి. ఇక నమ్మకస్తులైన కస్టమర్లకయితే డిపాజిట్ లేకుండా కార్లను అద్దెకు ఇస్తున్నారు. వివిధ రకాల రేట్లతో కార్లు అందుబాటులో ఉంటాయి.
Post a Comment