ఆదాయం ఎంత? నిత్యావసర వస్తువులు కొన్న తరువాత, పవర్ బిల్లు, డిష్ బిల్లులు చెల్లించగా మిగిలేదెంత? పిల్లల స్కూల్ ఫీజ్‌లకు ఇంకా సర్దాల్సి నదెంత? ఒక మధ్యతరగతి మనిషి తన నెలసరి బడ్జెట్ గురించిన ఆలోచనలివి. అయితే బడ్జెట్ లెక్కలేసుకున్నా ఒక్కోసారి నియంత్రణ లేకుండా పోతుంది. ఎక్కడ అనవసర ఖర్చు చేశామో తెలియదు. కానీ పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ యాప్స్ ఉంటే ప్రతిపైసా లెక్క రాసుకోవచ్చు. బడ్జెట్ అదుపు తప్పకుండా చూసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి.
ఆన్‌లైన్‌లో ఒక వస్తువు కొనాలనుకుంటాం. కానీ ధర ఎందులో తక్కువుందో తెలియదు. అలాంటప్పుడు వివిధ వెబ్‌సైట్‌లలో ఉన్న ధరను కంపేర్ చేయడానికి సులువైన మార్గం మైస్మార్ట్‌ప్రైస్ యాప్. సింపుల్‌గా ఉండాలి. సులభంగా ఉపయోగించేలా ఉండాలి. బడ్జెట్‌ను క్రియేట్‌ను చేసుకోవడానికి సహాయపడాలి. అలాంటి యాప్ కావాలంటే బడ్జెట్ బాస్ యాప్‌ను ఎంచుకోవచ్చు.
బిల్లు చెల్లింపులకు ప్రత్యేకం
మొబైల్ చెల్లింపులు చేసే వారికి ఉపయుక్తమైన అప్లికేషన్ పేటియం. డీటీహెచ్, డాటాకార్డ్ రీచార్జ్, విద్యుత బిల్లుల చెల్లింపులు, ఫోన్ బిల్లు చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్.. ఇలా అనేక రకాలుగా డబ్బులు చెల్లింపులు చేయడానికి ఉపయోగపడుతుంది. పేటియం వాలెట్‌ని ఉపయోగించి షాపింగ్ చేసే వారికి అమేజింగ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను సైతం అందిస్తున్నారు. ఆన్‌లైన్ చెల్లింపులకు సంబంధించిన మరో యాప్ పేపాల్. ఈ మొబైల్ యాప్ సహాయంతో మీ అకౌంట్‌ను మేనేజ్ చేసుకోవచ్చు. చెల్లింపులు చేయవచ్చు. రీసెంట్‌గా చేసిన లావాదేవీల వివరాలు తెలుసుకోవచ్చు. స్టోర్స్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. మొబైల్‌లో నుంచే బ్యాంక్ లావాదేవీలు సులువుగా జరిగిపోవాలనుకునే వారు ఈ యాప్ ఎంచుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ ఫోన్, వెబ్ వినియోగదారులు ఎంచుకోవచ్చు.
టాక్స్ సేవింగ్
ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఆదాయం ఎంత చూపించాలి? పన్ను రాయితీ పొందడానికి ఉన్న మార్గాలేంటి? అంతేకాకుండా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాక కూడా స్టేటస్ తెలియక కూడా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఇబ్బందులన్నింటికి సమాధానం క్లియర్‌టాక్స్ యాప్ చూపిస్తుంది. ఒక్క క్లిక్‌తో ఇన్‌కంటాక్స్ ఈ ఫైలింగ్ రిఫండ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో ఉన్న టాక్స్ క్యాలిక్యులేటర్ సహాయంతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎంత టాక్స్ సేవ్ చేశారో తెలుసుకోవచ్చు. ఇన్‌కంటాక్స్ ఈ ఫైలింగ్ చేసే వారి స్మార్ట్‌ఫోన్‌లో ఉండాల్సిన యాప్ ఇది.
ఎందులో ధర తక్కువ
ఆన్‌లైన్‌లో ఒక వస్తువు కొనాలనుకుంటాం. కానీ ధర ఎందులో తక్కువుందో తెలియదు. అలాంటప్పుడు వివిధ వెబ్‌సైట్‌లలో ఉన్న ధరను కంపేర్ చేయడానికి సులువైన మార్గం మైస్మార్ట్‌ప్రైస్. ఈ యాప్ సహాయంతో ఒక వస్తువు ధర ఏయే వెబ్‌సైట్లలో ఎంత ఉంది. ఎంత డిస్కౌంట్ లభిస్తోంది తదితర వివరాలను ఒకే స్ర్కీన్‌పై తెలుసుకోవచ్చు. ఇది సుమారు 100కి పైగా ఆన్‌లైన్ షాపింగ్ సైట్లను స్కాన్ చేసి వివరాలను చూపిస్తుంది. మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, కెమెరాలు, టీవీలు.. ఇలా కేటగిరీల వారిగా సెర్చ్‌చేసి చూడవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారు మనీ సేవ్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడే యాప్ ఇది.
ఆఫర్ల టైమ్
ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కూపన్లు, బెస్ట్ డీల్స్‌ను అనౌన్స్ చేస్తుంటాయి. ఆ సమయంలో కొనుగోలు చేయడం వల్ల మనీ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఏ వెబ్‌సైట్ ఏ ఆఫర్‌ని ప్రకటించింది? లేటెస్ట్ కూపన్స్, డీల్స్ గురించిన వివరాలు తెలుసుకోవడానికి దేసీడైమ్ యాప్ ఉపయోగపడుతుంది. 500లకు పైగా ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లు పెట్టిన ఆఫర్లు, డీల్స్, లేటెస్ట్ కూపన్ల వివరాలను ఈ యాప్ సహాయంతో తెలుసుకోవచ్చు. రెండు లక్షలకు పైగా వినియోగదారులు చేసిన పోస్టింగ్‌లు, రివ్యూలను చూడవచ్చు. ఈ-కామర్స్ స్టోర్స్‌లో ఉన్న లేటెస్ట్, హిడెన్ డీల్స్, కూపన్స్ గురించి తెలుసుకోవచ్చు.
బడ్జెట్ మేనేజర్
ఖర్చుపై నియంత్రణ లేకపోతే నెలాఖరులో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆదాయం, ఖర్చుపై తప్పనిసరిగా అవగాహన ఉండాలి. ఈ లెక్కలన్నీ చూసుకోవాలంటే హోమ్ బడ్జెట్ మేనేజర్ ఉండాల్సిందే. ఆదాయం, ఖర్చు, బిల్లులు, బడ్జెట్ వివరాలు నమోదు చేయడం, చూడటం వంటివి చాలా సులభంగా చేసుకోవడానికి హోమ్‌స్ర్కీన్ అనువుగా ఉంటుంది.
అన్నీ ఒకే చోట
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, ఎల్‌ఐసీలో జీవితబీమా, షేర్ మార్కెట్లోనూ డబ్బులు, బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు.. వీటన్నింటిని ఒకే డివైజ్‌లో ట్రాక్ చేయాలంటే మింట్ యాప్‌ని ఎంచుకోవాల్సిందే. భవిష్యత్తు ఖర్చుల కోసం బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం, ఫైనాన్షియల్ ఓవర్‌వ్యూ కోసం ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది.
ఖర్చు పెరిగిపోతోందా?
కొన్నిసార్లు అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి. ఎంత కంట్రోల్ చేసినా బడ్జెట్ అదుపు తప్పుతుంది. అలాంటప్పుడు బడ్జెట్ ఎంత పెరిగిపోయింది. అదనంగా ఎంత ఖర్చు చేశాం తెలుసుకోవాలంటే లెవెల్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. రోజు, వారం, నెలలో ఎంత ఖర్చు చేశారో ట్రాక్ చేసి చూసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే ఉద్దేశించిన మరో బడ్జెట్ ట్రాకింగ్ అప్లికేషన్ మనీవైజ్. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆన్‌లైన్ సర్వర్‌తో సింక్రనైజ్ కావడం ఉండదు. ఆఫ్‌లైన్‌లోనే యాప్‌ని ఉపయోగించుకోవచ్చు. బడ్జెట్ ఖర్చులు అప్‌డేట్‌గా ఉండాలనుకునే వారికి బెస్ట్ యాప్ ఇది.
టూర్‌లో జమాఖర్చు
ఎక్స్‌పెన్సిఫై.. ప్రత్యేకంగా బిజినెస్ ట్రావెలర్స్ కోసం ఉద్దేశించిన యాప్ ఇది. ట్రావెలింగ్‌లో పెట్టిన ఖర్చులను రిపోర్టు రూపంలో పొందవచ్చు. ప్రతి పైసాకు రిపోర్టును క్రియేట్ చేసుకోవచ్చు. రిసిప్ట్‌ల ఫోటోలు తీసుకుని భద్రపరచుకోవచ్చు. టైమ్‌ను ట్రాక్ చేయవచ్చు. ఎంత దూరం ట్రావెల్ చేసింది, ఎక్కడెక్కడ ఆగింది రికార్డు చేసి పెట్టుకోవచ్చు. రిపోర్టులన్నింటిని అవసరమైనపుడు ప్రింట్ తీసుకోవచ్చు. ట్రావెల్ ఎక్స్‌పెన్స్‌పై నియంత్రణ ఉండాలనుకునే వారి స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్ ఇది. బిజినెస్ ట్రావెలర్స్ ఉపయోగించదగిన మరో యాప్ వన్ టచ్ ఎక్స్‌పెన్సర్. ఇది కూడా ఉపయోగకరమైన అప్లికేషన్. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
పక్కా ప్లానింగ్
సింపుల్‌గా ఉండాలి. సులభంగా ఉపయోగించేలా ఉండాలి. బడ్జెట్‌ను క్రియేట్‌ను చేసుకోవడానికి సహాయపడాలి. అలాంటి యాప్ కావాలంటే బడ్జెట్ బాస్‌ని ఎంచుకోవాలి. మీ పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ మొత్తాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడెక్కడ ఖర్చు పెరిగిపోతోందో ఐడెంటిఫై చేసి చూపిస్తుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ పక్కాగా ఉండాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment