న్యూదిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇటీవల విటారా బ్రెజ్జా పేరిట కొత్త ఎస్‌యూవీ(స్పోర్ట్స్ వినియోగ వాహనం) కారును విపణిలోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కారుకి అనూహ్య స్పందన లభిస్తోందని కంపెనీ తాజాగా వెల్లడించింది. విడుదల చేసిన కేవలం 48గంటల్లో 5,600మంది బుక్ చేసుకున్నారని కంపెనీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
గత మంగళవారం విడుదలైన ఈ కారు ధర రూ.6.99-9.68లక్షలుగా నిర్ణయించారు. ఇది లీటర్‌కు 24.3కి.మీ మైలేజిని ఇస్తుందని, ఎస్‌యూవీ విభాగంలో ఇదే అత్యధికమని కంపెనీ తెలిపింది.
Post a Comment