ముంబై: ప్రముఖ కార్టూనిస్టు సుధీర్ తైలాంగ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన గుర్గావ్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. పలు ఆంగ్ల దినపత్రికల్లో చిత్రకారుడిగా ఆయన పనిచేశారు. 1982లో కార్టూనిస్టుగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన సుధీర్ తైలాంగ్ వ్యంగ్య చిత్రకారుడిగా రాణించారు. ఆయన చూపించిన విశేష ప్రతిభకుగాను 2004లో పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. కాగా తన అద్భుతమైన కార్టూన్లతో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికని సుసంపన్నం చేసిన సుధీర్ తైలాంగ్ పూర్వీకులు తెలంగాణా ప్రాంతీయులు.
అవినీతి, నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఆకలి తదితర అంశాలపై ఆయన గీసిన కార్టూన్లు సుధీర్ తైలాంగ్ పొందాయి. ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై ఆయన వేసిన వ్యంగ్య చిత్రాలు, పుస్తకాన్ని ప్రచురించి వార్తల్లో నిలిచారు. కాగా సుధీర తైలంగ్ మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా సహా పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రతికా ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు.
Post a Comment