వారియర్స్ ‘హీరో’చిత విన్యాసం...
PUBLISHED ON: February 15, 2016
BY: Unknown
IN: SPORTS
తెలుగు సినిమా క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందో తెలుసు కదా? అప్పటి వరకూ ప్రత్యర్థిదే ఆధిపత్యం కానీ చివర్లో హీరో వీరోచితంగా రెచ్చిపోతాడు. అనుహ్యంగా పుంజుకొంటాడు. ప్రత్యర్థిని మట్టికరిపించి ‘శుభం’ కార్డు వేస్తాడు. అచ్చంగా సీసీఎల్ (సెలబ్రెటీ క్రికెట్ లీగ్)లో అదే జరిగింది. ఫస్టాఫ్ అంతా కర్ణాటక జట్టుదే. టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగి వారియర్స్ బౌలింగ్ భరతం పట్టి 208 పరుగుల విజయలక్ష్యం నిర్దేశించింది. టీ20 లో ఏ జట్టుకైనా ఇది కష్టసాధ్యమైన టార్గెట్. కానీ వారియర్స్ ముందు 208 పరుగులు చిన్నదిగా కనిపించింది. ప్రతి బంతికీ బౌండరీకి తలరించాలన్న లక్ష్యంతో ఆడిన సచిన్... సచిన్‌కి అండదండగా నిలిచిన ప్రిన్స్.. చివర్లో చిచ్చరపిడుగులా చెలరేగిన అఖిల్... తెలుగు వారియర్స్‌కు అద్భుత విజయాన్ని అందించారు. దాంతో రెండోసారి సీసీఎల్ విజేతగా అవతరించింది తెలుగు వారియర్స్. సినిమా, క్రికెట్ మేళవింపుగా సాగుతున్న సీసీఎల్ వినోదం ఈ ఏడాదీ సూపర్ హిట్ అయ్యింది. ఈ క్రీడా సంబరానికి ఈనాడు ప్రచార భాగస్వామిగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన సీసీఎల్- 6 ఫైనల్ ముచ్చట్లు ఇవీ!
* టాస్ గెలిచిన కర్ణాటక బుల్డోజర్స్ జట్టు నాయకుడు సుదీప్ బ్యాటింగ్ తొలుత ఎంచుకొన్నాడు. తొలి ఓవర్లోనే రఘు బౌలింగ్‌లో రాహుల్ (0) క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్ దిగిన ధ్రువ్ తొలుత ఆచితూచి ఆడాడు. ధ్రువ్ జోరు పెంచే సమయంలో ప్రదీప్ (17) రఘు బౌలింగ్‌లో ఔటై పెవిలియన్‌కు చేరాడు.
* ఈ దశలో కార్తీక్ (37) తోడుగా ధ్రువ్ రెచ్చిపోయాడు. బౌండరీలతో మైదానాన్ని హోరెత్తించాడు. దాంతో కర్ణాటక స్కోరు బోర్డు ఉరకలెత్తింది. 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన ధ్రువ్ ఆ తరవాత వేగం పెంచాడు. ఒక దశలో సెంచరీ సాధించేలా కనిపించినా మూడు పరుగుల దూరంలో ఆగిపోయాడు. 50 బంతుల్లో 97 (12 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసి కర్ణాటక జట్టుకు భారీ స్కోరు అందించాడు.
* ధ్రువ్‌తో పాటు ప్రతాప్ (13), సుదీప్ (14) పరుగులు చేయడంతో కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. వారియర్స్ తరపున రఘు పొదుపుగా బౌలింగ్ చేశాడు. నందకిషోర్ ధారాళంగా పరుగులు ఇచ్చినా మూడు కీలకమైన వికెట్లు పడగొట్టాడు.
* 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్‌కి తొలి ఓవర్లోనే ఓ సిక్సు కొట్టి శుభారంభాన్నిచ్చాడు సచిన్ జోషి. తెలుగువారియర్స్ పవర్ ప్లే నిబంధనల్ని చక్కగా వాడుకొంటూ బౌండరీలు రాబట్టారు. తొలి ఆరు ఓవర్లలోనే 57 పరుగులు పిండుకొన్నారు.
* సచిన్ జోషీ వీరబాదుడు కారణంగా కొండంత లక్ష్యం తరిగిపోతూ వచ్చింది. సచిన్ జోషీ 27 బంతుల్లోనే అర్ధ సెంచరీసాధించాడు. ప్రిన్స్ నిదానంగా ఆడుతూ సచిన్‌కి తోడ్పాటు అందించాడు. ఈ జోడీ 55 బంతుల్లోనే 100 పరుగుల మైలు రాయిని దాటించారు.
* సచిన్ జోషీ ఆటతీరు ప్రొఫెషనల్ క్రికెటర్లను తలపించింది. ఆఫ్ డ్రైవ్, స్వీప్ షాట్లతో అలరించాడు. సిక్సర్లతో రెచ్చిపోయాడు. 43 బంతుల్లోనే సెంచరీ సాధించి తెలుగు వారియర్స్‌ని తిరుగులేని స్థానంలో నిలిపాడు. ప్రిన్స్ 35 బంతుల్లో 50 పరుగుల మైలురాయిని అందుకొన్నాడు. మహేష్ వేసిన 14వ ఓవర్లో వరుసగా రెండు సిక్సులు బాదిన సచిన్ జోషీ (49 బంతుల్లో 114) ఆఖరి బంతినీ బౌండరీకి తరలించే క్రమంలో ధ్రువ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో 171 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సీసీఎల్ 6లో ఇదే రికార్డు భాగస్వామ్యం.
* సచిన్ స్థానంలో వచ్చిన అఖిల్ ఆడుతూ పాడుతూ పరుగులు తీశాడు. ధ్రువ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లతో అలరించాడు. విన్నింగ్ షాట్‌గా అఖిల్ బౌండరీ బాదడంతో 14 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో తెలుగువారియర్స్ విజయకేతనం ఎగరేసింది. అఖిల్ (25), ప్రిన్స్ (61) నాటౌట్‌గా నిలిచారు.
* అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించిన సచిన్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బ్యాట్స్‌మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గానూ నిలిచాడు.
* తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, నాగార్జున, వెంకటేష్, రానా, రకుల్‌ప్రీత్ సింగ్, తాప్సి, రెజీనా, ఆదాశర్మ, సీరత్‌కపూర్, మహేష్‌బాబు తనయుడు గౌతమ్, సుధీర్‌బాబు, అతని తనయులు చరిత్, దర్శ్యంత్ స్టేడియంలో సందడి చేశారు.
* మ్యాచ్ గెలిచిన అనంతరం కథానాయకుడు వెంకటేష్ నృత్యం చేసుకొంటూ మైదానంలోకి వెళ్లారు. ఆటగాళ్లందరినీ అభినందించి వాళ్లతో కలసి మైదానమంతా తిరుగుతూ ప్రేక్షకులకి అభివాదం చేశారు. ఉల్లాసినులతో కలసి నృత్యం చేశారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
About the Author
Unknown
Author & Editor
No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!
Post a Comment