తమిళసినిమా; నటి ఆండ్రియా బహుభాషా నటినే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. ఆమెలో మంచి గాయని ఉన్నారు. చక్కని కవితలు కూడా రాస్తారు. ఇక నటిగా ఆండ్రియా ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి నటిని కాల్‌గర్ల్ పాత్ర వెంటాడుతోంది. అదేమిటో చూద్దామా.. దర్శకుడు వెట్ట్రిమారన్ చాలా కాలం క్రితమే ధనుష్ హీరోగా వడచెన్నై అనే చిత్రాన్ని రూపొం దించనున్నట్లు వెల్లడించారు. అందు లో కాల్‌గర్ల్ పాత్రకు నటి ఆండ్రియాను ఎంపిక చేశారు. చిత్రంలో ఆమె పాత్ర చాలా కీలకం అన్నారు.
అయితే ఆ చిత్రం ప్రారంభం చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఆ తరువాత వడచెన్నై చిత్రం నుంచి శింబు వైదొలిగారు. దీంతో చిత్రం నిలిచి పోయిందనే ప్రచారం జోరందుకుంది. కాగా అదే చిత్రాన్ని ఇప్పుడు ధనుష్ కథానాయకుడిగా తెరకెక్కించడానికి దర్శకుడు వెట్ట్రిమారన్ రెడీ అయ్యారు. ఇందులో కథానాయికగా నటి సమంత నటించనున్నారు. మరో ముఖ్య పాత్రలో విజయ్‌సేతుపతి నటించనున్నారు.
కాగా కాల్‌గర్ల్ పాత్ర మాత్రం ఆండ్రియాను వదలలేదు. ఆ పాత్రను ఆమెతోనే చేయించనున్నారట. ఇక పోతే ఆండ్రియా నటుడు శింబుకు చేయూత నివ్వనున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఇదునమ్మఆళు చిత్రంలో నయనతార నాయకి. ఆ చిత్రం పూర్తి అవ్వడానికి ఇంకా రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది.అయితే ఇప్పటికే ఇదునమ్మఆళు చిత్రానికి చాలా కాల్‌షీట్స్ కేటాయించాననీ ఇక ఆ చిత్రంలో నటించేది లేదని నటి నయనతార ఖరాఖండీగా చెప్పడంతో చిత్ర దర్శక నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోలేదు.
ఈ చిత్ర దర్శకుడు పాండిరాజ్ నయనతారతో పాటల చిత్రీకరణను పూర్తి చేయడానికి చేసిన చివరి ప్రయత్నం కూడా బెడిసి కొట్టడంతో నట ఆండ్రియాను ఆశ్రయించారు. ఆమె పచ్చ జెండా ఊపడంతో ఇప్పుడు ఇదునమ్మఆళు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో టీ.రాజేంద్రన్ నిమగ్నమైయ్యారు.
Post a Comment