పూరి జగన్నాథ్ స్కూల్ నుంచి వచ్చిన కథానాయిక... అదాశర్మ. ‘హార్ట్‌ఎటాక్’తో తెలుగు తెరకి పరిచయమైంది. తొలి చిత్రంతోనే అటు పరిశ్రమనీ, ఇటు ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. తెరపై అదా నటనకి మంచి మార్కులే పడ్డాయి. దాంతో ఆమెకి అవకాశాలు వెల్లువెత్తుతాయని వూహించారంతా. కానీ అదేం జరగలేదు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లాంటి చిత్రాల్లో చిన్న పాత్రలతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. చిన్న పాత్రలే అయినా వాటితోనూ బాగానే సందడి చేసింది. ఇటీవల ఆదితో కలిసి ‘గరం’లో నటించింది. ఆ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అదాతో ‘సితార’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విషయాలివీ...
సినిమా పేరుకు తగ్గట్టుగానే ప్రచార చిత్రాల్లో మీరు గరం గరంగా కనిపిస్తున్నారు...?
కానీ నన్ను దృష్టిలో ఉంచుకొని పెట్టిన పేరు కాదది. కథే అలా ఉంటుంది. అయితే పాటల్లో మాత్రం ఫక్తు కమర్షియల్ చిత్రాల్లోని కథానాయికలాగా గరమ్‌గానే కనిపిస్తా. నేను గరమ్‌గా కనిపించడం సంగతేంటో కానీ ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు మాత్రం మేం మాడిపోయాం. అసలే నేను బురఖా ధరించి నటించాల్సి వచ్చింది. నడి వేసవిలో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో బురఖా ధరించి ఈ చిత్రంలో నటించా. సమీరా అనే ఓ ముస్లిమ్ యువతి పాత్ర నాది.

కమర్షియల్ కథానాయిక అనిపించుకోవాలనే ఆ సినిమా చేశారా?
ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొని నేనెప్పుడూ కథల్ని ఎంచుకోను. నాకు నటన ఇష్టం. ఏది మంచి పాత్ర అనిపిస్తే ఆ పాత్రలో నటించడానికి ఇష్టపడతా. కాకపోతే ఇదివరకు నేను చేసిన సినిమాల్లో డ్యాన్స్ పరంగా నా ప్రతిభని నిరూపించుకొనే అవకాశం దొరకలేదు. ‘గరం’లో నేను వేసిన డ్యాన్సులు నాలోని కొత్త కోణాన్ని చూపిస్తాయని నమ్ముతున్నా.

సమీరా పాత్రకోసం ప్రత్యేకంగా ఏమైనా కసరత్తులు చేయాల్సొచ్చిందా?
ఇందులో చాలావరకు నా కళ్లు మాత్రమే కనిపిస్తుంటాయి. అంటే కళ్లతోనే భావాలు పలికించాల్సి వుంటుందన్నమాట. ఇందులో నేను కేవలం ఐదంటే ఐదు సంభాషణలు మాత్రమే పలికా. మిగిలిన సన్నివేశాల్లో నా కళ్లే మాట్లాడుతుంటాయి. ఈ పాత్ర గురించి వినగానే నాకు చిన్నప్పుడు చూసిన ‘బొంబాయి’ సినిమా, అందులోని మనీషా కొయిరాలా పాత్ర గుర్తుకొచ్చాయి. చిన్నప్పుడు ‘బొంబాయి’ చూసి మణిరత్నంగారికి అభిమానిగా మారిపోయా. అందులో మనీషా కొయిరాలా పాత్రపై అప్పట్లోనే ఇష్టం పెంచుకొన్నా. అలాంటి పాత్రలో నటించే అవకాశం రావడమంటే... కల నిజమైనట్టే. ఈ సినిమా వరకు నాకు మనీషానే స్ఫూర్తి.

ఆదితో కలిసి నటించడం ఎలా అనిపించింది?
తను మంచి వ్యక్తి. ఈ సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడే తను తండ్రయ్యాడు. ఆది మంచి తండ్రి కూడా. ఇక తన నటన విషయానికొస్తే సెట్స్‌లో ఏదైనా సన్నివేశం చేయాలన్నప్పుడు ఒకటికి పదిసార్లు సాధన చేశాకే కెమెరా ముందుకు వెళుతుంటారు. ఆ విషయంలో నేను కూడా అంతే. ‘హార్ట్‌ఎటాక్’లో నా కళ్లని చూసే నన్ను ఎంచుకొన్న మదన్‌గారు ఇందులో నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు.

కథానాయికగా మీ ప్రయాణం సంతృప్తికరంగానే సాగుతున్నట్టేనా?
కెరీర్ విషయంలో ఎలాంటి బాదర బందీలు లేవు. ఖాళీ లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నా.

మీ కెరీర్ గురించి ఎవరేమనుకొంటున్నారో ఆరాలు తీస్తుంటారా?
నా పని విషయంలో నేను సంతృప్తిగా ఉన్నానా లేదా? అన్నదే నాకు ముఖ్యం. అయినా ఎవరేం చెబుతారో అంటూ వింటూ పోతే... ఒకొక్కరి నుంచి ఒక్కో రకమైన అభిప్రాయం వినిపిస్తుంటుంది. అవన్నీ అవసరమా? నేను నడుస్తూ వెళుతున్నాననుకోండి... ‘అదా భలే నడుస్తోందే’ అనేవాళ్లు కొందరంటారు. మరికొందరు ‘నువ్వు హీరోయిన్‌వి... నడవడమేంటి? పరిగెత్తాలి’ అంటుంటారు. ఒకవేళ పరిగెత్తితే... ‘మరీ అంత పరుగు పనికి రాదు’ అనేవాళ్లూ ఉంటారు. అందుకే చేస్తున్న పనిపైన తప్ప మిగతా విషయాల్ని అంతగా పట్టించుకోను.

ఇప్పటిదాకా మీరు కొన్ని పాత్రల్ని పోషించారు. ఏ పాత్రలో సౌలభ్యంగా అనిపించింది?
నేనొక నటిని, ఎలాంటి పాత్రనైనా చేయగల సత్తా నాలో ఉండాలి. సవాళ్లు స్వీకరించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. నాకు ప్రేమకథలంటే ఇష్టం, నాకు భయపెట్టే పాత్రలైతే బాగా చేస్తానంటూ చెప్పలేను. ఒక ప్రత్యేకమైన ట్యాగ్‌ని వేలాడదీసుకొని నేను నటించలేను.

‘క్షణం’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
అదొక థ్రిల్లర్. ప్రస్తుతానికి అంతకుమించి ఏమీ చెప్పలేను.

Post a Comment