బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్‌గా భారీ చిత్రాలు నిర్మించే బండ్ల గణేష్ మలయాళ సినిమా రీమేక్ హక్కుల్ని దక్కించుకున్నాడు. దిలీప్, మమతా మోహన్ దాస్ జంటగా నటించిన ‘టూ కంట్రీస్’ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ టాక్‌తో 50 కోట్లకు పైగా వసూలు సాధించింది. రీసెంట్‌గా ఆ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు నిర్మాత బండ్ల గణేష్. ‘టూ కంట్రీస్’ చిత్ర తెలుగు హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించేందుకు బండ్ల గణేష్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...
'మలయాళ బ్లాక్ బస్టర్ టూ కంట్రీస్ చిత్ర హక్కుల్ని భారీ పోటీ మధ్య దక్కించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రం. అందుకే భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం. టాలీవుడ్‌లో ఉన్న టాప్ స్టార్స్ ఈ సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గం గురించి తెలియజేస్తాను'. అని అన్నారు.
Post a Comment