-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 02, 2016

టుడే న్యూస్ డైరీ...!!!


గ్రేటర్‌లో పోలింగ్: నేటి ఉదయం 7 గంటల నుంచి జీహెచ్ఎంసీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న ప్రక్రియ.  150  డివిజన్లలో మొత్తం 7,802 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. గ్రేటర్ పరిధిలో 74, 23, 980 మంది ఓటర్లు ఉండగా, పోటీలో 1,333 అభ్యర్థులున్నారు. పోలింగ్ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో నేడు సెలవు ప్రకటించారు.

శ్రీకాకుళంలో యువభేరి: కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ నేడు శ్రీకాకుళంలో యువభేరి కార్యక్రమాన్ని జరపనుంది. పట్టణంలోని టౌన్ హాలులో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరై, విద్యార్థినీ విద్యార్థులతో మాట్లాడతారు.

అనంతపురానికి మన్మోహన్, రాహుల్: ఉపాధి హామీ పథకం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ పథకం ప్రారంభమైన గ్రామం బండ్లపల్లి(అనంతపురం జిల్లా)కి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రానున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఇరువురు నేతలు ప్రసంగించనున్నారు.

విశాఖలో ప్రో కబడ్డీ: విశాఖలో జరుగుతున్న ప్రోకబడ్డీ లీగ్ పోటీల్లో నేడు తెలుగు టైటాన్స్ బెంగాల్ వారియర్స్ జట్టుతో తలపడనుంది.

కశ్మీర్ రాజకీయం: జమ్ముకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకుగల అవకాశాలు, తాజా పరిస్థితలపై ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు నేడు గవర్నర్ ను కలవనున్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు ద్రవ్యపరపతి విధానాన్ని సమీక్షించనుంది.

కుస్తీ పోటీలు: వరంగల్ నగరంలో నేటి నుంచి జాతీయ స్థాయి కుస్తీ పోటీలు ప్రారంభంకానున్నాయి.

దక్షిణాదికి మోదీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడుల్లో పర్యటించనున్నారు. కేరళలో జరిగే ప్రపంచ ఆయుర్వేదిక సదస్సులో మోదీ పాల్గొంటారు.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu