రేపల్లె (గుంటూరు): కాపు రిజర్వేషన్ విషయంలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పవన్ వైఖరిని తప్పుబడుతూ ఆయన పోస్టర్లను చించివేస్తున్నారు. కాపు గర్జన సభ సందర్భంగా తునిలో జరిగిన ఘటనపై పవన్ కల్యాణ్ సోమవారం విలేకరులతో మాట్లాడిన సంగతి తెలిసిందే.
ఈ విషయంలో పవన్ వైఖరిపై కాపు యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ పై అభిమానం చాటుతూ గతంలో గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఉప్పూడిలో తాము ఏర్పాటుచేసిన ఆయన ఫ్లెక్సీని మంగళవారం కాపు యువత కార్యకర్తలు చించివేశారు. సీఎం చంద్రబాబుకు అనుకూలంగా పవన్ వ్యవహరించడం సిగ్గుచేటని వారు వ్యాఖ్యానించారు.
Post a Comment