ముంబయి: బాలీవుడ్ చిత్రం అలీఘడ్ ట్రైలర్ దుమ్మురేపుతోంది. ఈ ట్రైలర్ విడుదలైన నాలుగు రోజుల్లోనే లక్షల మంది వీక్షించారు. హన్సాల్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ను జనవరి 28న విడుదల చేశారు. ఇంత భారీ మొత్తంలో స్పందన రావడంపై ఈచిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయి స్పందిస్తూ ట్వీట్ చేశారు.
'ఇప్పటికే అలీఘడ్ చిత్ర ట్రైలర్ ను 30 లక్షలమంది వీక్షించారు. ఇంకా వీక్షకుల సంఖ్య పెరుగుతునే ఉంది. ఇంత భారీగా స్పందించిన వారందరికీ ధన్యవాదాలు' అని ఆయన ట్వీట్ చేశారు. స్వలింగ సంపర్కం అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. స్వలింగ సంపర్కుడనే కారణంగా అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో విధుల నుంచి తొలగించబడిన ప్రొఫెసర్ శ్రీనివాస్ రామచంద్ర సిరాస్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
Post a Comment