నేను మా కిళ్ళీషాపులో కూర్చునే సమయంలో స్కూల్‌లో పనిచేసే ఓ ఇంగ్లీషు మాస్టారు నాకు ఇంగ్లీషు నేర్పి, మిఠాయి ఉండలు తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయేవాడు. ఇంగ్లీషులో విచిత్రమైన పదాలు నేర్పేవాడు. ‘‘ఇ.సా.ఎసా సచఎసా ఇనెవ్వర్ సా’’ నేను ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే మరో ఉండ లాగించేవాడు.’’
‘‘నా చిన్నప్పుడు నిడమర్రులో మా మేనమామ నాటకాలు వేసేవాడు. ఒకసారి ‘అన్నాచెల్లెలు’ అనే నాటకం వేస్తున్నాడు. ఆ నాటకం రిహార్సల్‌లో నేను సర్వీస్ చేసే బాయ్‌ని. దానిలో ఓ డైలాగ్ ఉంది. ‘‘అన్నయ్య సిగరెట్ వెలిగిస్తూ ఆలోచిస్తుంటాడు. చెల్లి అంటుంది. అన్నయ్యా అగ్గిపుల్ల ఆరిపోతుంది, త్వరగా వెలిగించు అంటుంది. ఇది ఆరదమ్మా! ఇది పేదవాడి గుండెల్లో రగులుతున్న అగ్ని’’ అని డైలాగ్ చెప్పి సిగరెట్టు అంటించుకోవాలి. అప్పుడు నేనన్నాను. ‘మావయ్యా, మావయ్యా... ఓ పెద్ద మైనం పుల్లకు చివర అగ్గిపుల్ల కట్టి వెలిగిస్తే డైలాగ్ అయ్యేదాకా వెలుగుతుంది కదా!’ అన్నాను. ‘బుడ్డ నాకొడకా, ఎదవ సలహాలివ్వకు, నువ్వు కర్టెన లాక్కో’ అన్నాడు. కర్టెన లాగటమే గొప్ప. నాటకం వేసే టైం వచ్చింది. ఆ సీన వచ్చింది. అగ్గిపుల్ల వెలిగించాడు. ఆరదమ్మా, ఇది పేదవాడి గుండెల్లో మండుతున్న అగ్ని అన్నాడో లేదో వెంటనే ఆరిపోయింది. మళ్ళీ వెలిగించాడు. మళ్ళీ డైలాగ్... మళ్ళీ ఆరిపోయింది. మూడోసారి ప్రారంభిస్తుంటే జనం గోల చేశారు. సిగరెట్టు వెలిగినట్టే ఇంక కానీయ్ అని అరిచారు. ఇలాంటి నవ్వుకునే సంఘటనలు నాటకాల్లో చాలానే జరిగేవి.
నాతో ఉన్న ఓ మిత్రుడు చేత్తో పట్టుకుని ఆపి నన్ను పారిపోమన్నాడు. నేను పారిపోయానా, నెత్తిపైన ఓ తుండు కప్పుకుని నాటకం దగ్గరకు వెళ్ళి జనంలో కూర్చుండిపోయాను. తరువాత ఏదో పుంత గట్టు వెంట పత్తేపురం వెళ్ళిపోయాం. మర్నాడు వాళ్ళు పత్తేపురం కాలేజీకి వచ్చి ప్రిన్సిపల్‌గారిని కలిశారు. ఏదో పొరపాటు జరిగిపోయిందని చెప్పి వాళ్ళను పంపించేశారు. ఇలా సాగిపోయాయి నా చిన్ననాటి రోజులు’’ అన్నారు ఎం.ఎస్.
ఊళ్ళో ఫ్యాక్షన్ జ్వాలలు
కోస్తా ప్రాంతంలోనూ, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోనూ ఫ్యాక్షన కక్షలు అంతగా కనిపించేవి కావు. హత్యలు, దోపిడీలు ఉన్నా, గొలుసుకట్టు హత్యలు లేవనే చెప్పాలి. కానీ ఓ ప్రత్యేక సందర్భంలో ఈ హత్యాకాండ నిడమర్రులో రాజుకుంది. ఊళ్ళో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం వెనక పాటిమన్ను దిబ్బలు ఉండేవి. ఈ మట్టిని రైతులు పొలాలలో వేసుకుంటే అధిక దిగుబడి తీసుకోవచ్చుననే నమ్మకం ఉండేది. నిడమర్రు పక్కనే ఉన్న మందలపర్రు గ్రామంలో, ధనిక రైతయిన ఓ రాజుగారు ఈ మట్టిని తన పొలాల్లోకి తరలించటం ప్రారంభించారు. ఇది గమనించిన వెంకటాపురం (నిడమర్రులో భాగం) మునసబు పసుపులేటి సత్యనారాయణ దానిని అడ్డుకుని ‘‘మా ఊరులోని పాటిమన్ను మరో చోటికి తరలించడం భావ్యం కాదని’’ ఎదుర్కొన్నాడు. దీనితో ఆయన ప్లాన మార్చి నిడమర్రు గ్రామ కాపులకు తన భూములు కౌలుకు ఇచ్చి ఈ పాటిమన్ను తొలగించడం ప్రారంభించారు. దీనితో నిడమర్రు రైతుల మధ్యనే చిచ్చు రగులుకుంది. రెండు వర్గాలుగా విడిపోయి కొట్లాడుకున్నారు.
ఇది రగిలి రగిలి రావణకాష్ఠం అయింది. సమ ఉజ్జీలుగా ఉండటం వల్ల దాడులు ప్రతిష్ఠాత్మకంగా సాగేవి. టైమ్, ప్లేస్ చెప్పుకొని దాడిచేసేవారు. ఓ వర్గం నిద్రపోతున్నప్పుడు వాళ్ళెళ్ళి పొడిచేయడం. మరో వర్గం ఎటాక్ చేసినప్పుడు వాళ్ళు పారిపోయినట్టు నటించి తిరిగి దాడి చేయడం లాంటివి జరిగేవి. ఈ విషయాలు గుర్తుచేసుకుంటూ ఎం.ఎస్. ఇలా అన్నారు. ‘‘ఆ రోజులు చాలా భయంకరమైనవి. బహుశా నేను 8వ తరగతి చదువుతున్న రోజులు. మా ఇంట్లో ఓ ఆర్.ఎమ్.పి. డాక్టర్ అద్దెకి ఉండేవారు. ఆయన ద్వారా నేను గాయాలు తగ్గించడం ఎలా, ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎలా అనేవి నేర్చుకున్నాను. ఈ దాడులలో పెద్ద గాయాలకు, కత్తిపోట్లకు గురయిన వారిని రక్షించడానికి ప్రయత్నం చేశాను. ఈ మారణకాండలో పాల్గొన్న వారందరూ మా దూరపు, దగ్గర బంధువులే. ఈ సంఘటనలు జరిగేటప్పుడు అందరూ పారిపోయేవారు. నేను మాత్రం ధైర్యంగా గాయాలు అయిన వారికి సేవ చేశాను. దీనివల్ల సుమారు ఎనిమిది మందికి ప్రాణదానం చేశానని కచ్చితంగా చెప్పగలను.
ఓసారి జరిగిన సంఘటన చెప్పాలి. మా మేనమామ ఒక గ్రూపుకు సైన్యాధ్యక్షుడు లాంటివాడు. అతను తన గ్రూపు వాళ్ళకి ఒక విషయం నేర్పాడు. వాళ్ళు పారిపోయినట్లు నటించి దాక్కొని, ఎమ్మటే బల్బులలో యాసిడ్ వేసి, మైనం ముద్దలతో పైన పూడ్చి, ప్రత్యర్థులపై విసిరేవారు. ఇలా యాసిడ్ బారిన పడిన వారిని కొంతమందిని కాపాడాను. వాళ్ళపై తడిసిన గోనుగుడ్డలు కప్పి చల్లపరిచి సాంత్వన చేకూర్చేవాడిని. ఇలా చాలా మంది పెద్దవాళ్ళ మన్ననలు పొందాను. ఈ గొడవల్లో మొత్తం 24మంది చనిపోయారు. చాలామంది గాయాలపాలయ్యారు. మరికొందరు వికలాంగులయ్యారు.
ప్రత్యక్ష సాక్షిని
నేను ప్రత్యక్షంగా ఓ హత్య చూశాను. ఒక గ్రూపు ఏలూరులో జిల్లా కోర్టుకు వెళ్ళి తిరిగి నిడమర్రు చేరుకుంది. సరిగ్గా అప్పుడే మరో గ్రూపు బస్టాండు వద్ద దాడికి రెడీగా ఉంది. బస్సులో వచ్చేవాళ్ళు కూడా బల్లేలతో దిగారు. ఇరువర్గాల ఘర్షణలో ఓ గ్రూప్ పారిపోయింది. అందులో ఒకడు ఓ గోడచాటున దాక్కుని తరుముకుంటూ వెళ్ళిన గ్రూపులో చివరి వాళ్ళను పొడిచేశాడు. అతను రోడ్డుమీద పడి విలవిలలాడుతుంటే జనం అందరూ పారిపోయారు. నేను కాఫీ హోటల్ తలుపు తెరిచి అతని దగ్గరకు వెళ్ళి పెన్సిలిన బాటిల్ పగులగొట్టి అందులోని పౌడర్ వేసి అతనికి కట్లు కట్టాను. కాని ఏమి లాభం. రక్తం ఎక్కువ పోవటం వల్ల అతను చనిపోయాడు.
మరో సంఘటన చెబుతాను. కొల్లేరులో రాజుగారి పొలం కాపలా కాస్తున్న వెంకటేశ్వర్లు చాలా బలమైనవాడు. వాడిని చంపేస్తే మనం గెలవచ్చని, బండెంకడు అనే అతనిని పంపించారు. అతను కొల్లేరు వెళ్ళి వెంకటేశ్వర్లుతో కలిసి సారాతాగి సందర్భం చూసుకుని అతనిని చంపేయాలని ప్లాన. అక్కడ బాతుగుడ్లు, అవీ ఏరుకుని తింటుంటే, వెంకటేశ్వర్లు దూరంగా ఒంటేలుకు వెళ్ళినప్పుడు దూరంగా గడ్డిలో బండెంకడు దాచిన బల్లెం కనపడింది. అతని ప్లాన అర్థం అయ్యి ఆ బల్లెంతోనే అతన్ని పొడిచేశాడు. ఆ రక్తం బట్టలతో మా ఇంటికి వచ్చాడు.
అప్పటికి నేను మా పశువుల పాకలో ‘నీతిచంద్రిక’ చదువుకుంటున్నాను. అతను మా మేనమామకు మేనమామ. వాడొచ్చి నన్ను రాజుగారి ఇంటికాడ దింపండిరా అన్నాడు. ఒళ్ళంతా రక్తం మరకలు. వెంటనే నేను సైకిల్ తొక్కుకుంటూ అతన్ని మందలపర్రులో దింపాను. తరువాత అతను అండర్‌గ్రౌండ్‌కు వెళ్ళిపోయాడు.’’ ఇటువంటి అనేక సంఘటనలతో, సుదీర్ఘంగా సాగిన కోర్టులు, శిక్షల తంతుతో సుమారు 20 సంవత్సరాలు సాగింది ఈ మారణకాండ. కాని ఎం.ఎస్ భాషాప్రవీణ చదివి, ఉద్యోగంలో చేరిపోవడంతో ఆయనకు ఊరట కలిగింది.
భాషాప్రవీణ కాలేజీలో
కాలేజీ రోజులను ఎం.ఎస్.గారి మాటల్లోనే విందాం!
‘‘వ్యవసాయం చేస్తున్న రోజుల్లో ఒక మిత్రుడు పరిచయమయ్యాడు నాకు. ఒరే ఇక్కడుంటే నీ చదువు సాగదు. పత్తేపురంలో మూర్తిరాజుగారని ఒకాయన ఓరియంటల్ కాలేజీ పెట్టారు. అక్కడికెళ్లి చదువుకో అన్నాడు. భోజనం ఎలాగా? అన్నాను. అక్కడ ఉచితంగా హాస్టల్ సౌకర్యం కూడా ఉంది అన్నాడు. అప్పుడు ఏం చేశానంటే, ఇంట్లో చెప్పకుండా ఒక మిడ్‌నైట్ పారిపోయాను. అప్పుడు నాకు 16, 17 సంవత్సరాలు ఉంటాయి. 1966, ఆ ప్రాంతంలో వెళ్ళిపోయాను. మూర్తిరాజుగారు చాలా గొప్ప వ్యక్తి. వెస్ట్ గోదావరిలో 60 స్కూల్స్, 12 కాలేజీలు స్థాపించారు. మహా విద్యాదాత.
ఓరియంటల్ కాలేజీ (సంస్కృతం) స్థాపించి, పత్తేపురంలో ఆంధ్రప్రదేశలో ఉండేటటువంటి అత్యద్భుతమైన పండితులను తీసుకొచ్చి రిటైర్ అయినటువంటి వాళ్ళను అక్కడ పెట్టి విద్యను నేర్పిస్తున్నారు. మూర్తిరాజుగారు ఆశయపరుడే కానీ, అది బ్రాహ్మణుల యొక్క కళాశాలనేది ఒక పేరు. నేచురల్‌గా బ్రాహ్మణుల కళాశాల అనేటప్పటికీ ఇతరుల్ని కొంచెం చిన్నచూపు చూసేవారు. ఒక మిత్రుడు నాకు చెప్పాడు, నీవు బ్రాహ్మడు కాదు కాబట్టి అక్కడ జాయిన కానివ్వరు అన్నాడు. అదే విద్యకు అడ్డం వస్తుంది అనుకుంటే నేను బ్రాహ్మణుడిగా మారిపోతానన్నా. ఎలా మారతావు? అన్నాడు.
మిత్రుల ప్రోత్సాహంతోటే!
జస్ట్ ఒక పావలా పెట్టి ఒక జంధ్యం కొన్నా. మా మిత్రుడి ప్రోత్సాహంతోటే. మిగిలిన మిత్రులు అందరూ బ్రాహ్మణులే. కొడుకుల నర్సింహమూర్తి, తొట్టగుంట్ల వీర వెంకట సుబ్రహ్మణ్యం, మల్లికార్జునరావు, రంగనాథం వీళ్ళందరూ బ్రాహ్మణులే. వీళ్ళందరికీ నేనంటే ఇష్టం. వాళ్ళ రూంలో పెట్టుకున్నారు నన్ను. జస్ట్ నిడమర్రు ఐదు కిలోమీటర్లు. ఇంట్లో తెలియకూడదు న్యూస్. తెలిస్తే మానాన్న తీసుకుపోతాడు. దటీజ్ ది ప్రాబ్లమ్. నేను చదువుకోవాలి.
‘‘ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింధూరం విశ్వం దేవం దాతా పురస్తాముదాజయహారా విశ్వ ప్రజ్ఞాం ప్రదితసతస్రహ త్వమేయం విద్వానిహబవతి నాణ్యపంతా ఏనాయ విద్యతే ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వంసింధూరం విశ్వం నారాయణమ్ దేవం అక్షరం పరమం పదమ్ విశ్వమే వేదంపురుషస్యస్తద్వస్యం ఉపదేవతు పతిం విశ్వసాత్నే స్వర్గం శాశ్వతం శివం అచ్చితం నారాయణమ్ మహాజ్ఞేయం విశ్వాత్మాయణం పరాయణం నారాయణం పరంజ్యోతి రాత్మా నారాయణా పర్ణా యచ్చగించ జగత సర్వం దృశ్యతే స్వీయతేపివా’’
అంటే నాకు ఆరోహణలు అవరోహణలు తెలుసు. జంధ్యం పన్జేయటమంటే ఎంత పన్జేసిందో దాని ఆనవాలు బట్టి చెపుతాను. జంధ్యం కొనుక్కున్నాను. వేసుకున్నాను. అప్పుడు ఏ జాతైనా సరే బ్రాహ్మణ జాతిని గౌరవించారు. ఎందుకు గౌరవించారంటే, వేదాలలో రాసిన విద్య వాళ్ళకు ఉండేది. క్షతానాం గాయతా ఇతి క్షత్రియః, గాయపడిన వాళ్ళని రక్షించేవాడు క్షత్రియుడని, విద్య బ్రాహ్మలదని, వ్యాపారం వైశ్యులదని, కాపలా గానీ మిగిలినవిగానీ అన్నీ శూద్రులవని రచించారు. విద్యను వాళ్ళ వద్దే ఉంచుకున్నారు కాబట్టి వాళ్ళను గౌరవించేవారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment