కాలిఫోర్నియా: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్ భారత్‌లో వరద హెచ్చరికలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. గూగుల్ పబ్లిక్ అలర్ట్స్ ద్వారా భారత్‌లో నదులకు వరదలు వస్తే వెంటనే హెచ్చరిస్తుంది. నదుల్లో నీటిమట్టం స్థాయి సమచారం అందజేయనుంది. సెంట్రల్ వాటర్ కమిషన్‌కు క్రియాశీలక పరిశీలక కేంద్రాలు ఉన్న 170 ప్రాంతాల్లో గూగుల్ వరద హెచ్చరికలు ఇవ్వనున్నట్లు బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.
గూగుల్ వెబ్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ యాప్‌లో గూగుల్ నౌ కార్డ్స్, హోంపేజీలోని పబ్లిక్ అలర్ట్స్ ద్వారా గూగుల్ కంప్యూటర్, మొబైల్ ఫోన్ రెండింటిలోనూ వరద హెచ్చరికలు చూపిస్తుంది. అలర్ట్‌పై క్లిక్ చేస్తే వరద ముప్పు సమాచారంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తుందని గూగుల్ పేర్కొంది.
Post a Comment