-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 14, 2016

ప్రేమలో పడితే సంకేతాలివే...


రెండక్షరాల ప్రేమ. నిర్వచనానికి దొరకని చిన్న పదం. కొన్ని సార్లు అనుభూతిని కూడా వ్యక్తీకరించలేని మధుర భావం. ఇద్దరు మనుషుల్ని దగ్గర చేసినా, రెండు మనసుల్ని గిలిగింతలు పెట్టినా దండలో దారంలా ఉండేదే ప్రేమ. మనిషిని, స్థాయిని, పరిసరాలనుబట్టి వ్యక్తీకరణలో చిన్నపాటి తేడాలుంటాయేమో కానీ ప్రేమ లేని జీవితం ఉండదు. అందుకే ప్రేమ అనే పదం వింటే చాలు ఎటువంటి మనసులో అయినా ఏదో చిన్న భావన..ఏదో అలజడి మెదలక మానదు.
 
ఫిబ్రవరి 14 వస్తుందంటే చాలు, ప్రేమికులు సంబరంగా ఫీలవుతుంటారు. ఆ రోజు ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలా అని నెలరోజుల ముందు నుంచే ప్లాన చేస్తారు. ఇప్పటి కాలంలో ఉన్నవి రెండు రకాల ప్రేమలు. కళ్లతో పలుకరిస్తూ కాఫీతో మాట్లాడుకుని పబ్‌లో హగ్‌ చేసుకుని అర్థరాత్రి దాటాక సారీ డియర్‌.. అనే మెసేజ్‌తో బంధాన్ని తుంచే ప్రేమలున్నాయి. ఎదిరించి, పెళ్లి చేసుకుని ప్రేమను ఆస్వాదిస్తూ, పంచుతూ జీవితాన్ని ప్రేమమయం చేసుకున్న జంటలూ ఉన్నాయి. అనుభవం ఎలాంటిదైనా ప్రేమ ఒక తీయని భావన. తీయని బాధ. జీవితాంతం కాపాడు కోగలిగితే మధురమైన ఆ ప్రేమ స్వప్నం సాకారమవుతుందనడంలో సందేహమేమీ అక్కర్లేదు. 
 
వాలెంటైన్ వీక్‌
వాలెంటైన్ డే అంటే కేవలం ఫిబ్రవరి 14న సెలబ్రేట్‌ చేస్తారు. కానీ దానికి వారం రోజుల ముందు నుంచే సందడి నెలకొంటుంది. వాలెంటైన వీక్‌ అంటారు దాన్నే. ఈ వారం రోజులూ ప్రేమికులకు ప్రత్యేకమైనవే. 
 
రోజ్‌ డే: ఇందులో మొదటి రోజును రోజ్‌ డేగా చెబుతారు. ఈరోజున ఇష్టమైన వ్యక్తికి గులాబీలను ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు.
 
ప్రపోజ్‌ డే: రెండో రోజును ప్రపోజ్‌ డేగా జరుపుకుంటారు. ఈ ప్రపోజ్‌ డే నాడు తమ ప్రేమను అంగీకరించాల్సిందిగా అభ్యర్థనలు తెలియచేస్తారు.
 
చాక్లెట్‌ డే: మూడో రోజును చాక్లెట్‌ డేగా జరుపుకుంటారు. చాలా వరకు అబ్బాయిలే అమ్మాయిలకు ప్రపోజ్‌ చేస్తారు కాబట్టి వారు ఒప్పుకున్నట్లయితే తీపి గుర్తుగా ఉండడానికి అమ్మాయిలు ఇష్టపడే చాక్లెట్‌ను వారికి బహూకరిస్తారు.
 
టెడ్డీ డే: నాలుగో రోజును టెడ్డీ డేగా జరుపుకుంటారు. అమ్మాయిలు అమితంగా ఇష్టపడే టెడ్డీబేర్‌ను వారికి ప్రజెంట్‌ చేస్తారు.
 
ప్రామిస్ డే: ఇక ఐదో రోజును ప్రామిస్‌ డేగా జరుపుకుంటారు. జీవితాంతం నీ చేయి వదలనని, ఎంత కష్టమైనా సరే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమే ఈ ప్రామిస్‌ డే.
 
కిస్‌ అండ్‌ హగ్‌ డేస్‌: తర్వాతి రోజును కిస్‌ డేగా జరుపుకుంటారు. కిస్‌ పెట్టడం ద్వారా తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు. కిస్‌ డే తర్వాత హగ్‌ డే జరుపుకుంటారు. ఈ డే లన్నీ అయిపోయాక చివరి రోజుగా ఏడో రోజుగా వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. అయితే పాశ్చాత్య దేశాలలో ఈ డేలన్నింటినీ జరుపుకుంటున్నా మన దేశంలో మాత్రం ఒక్క వాలెంటైన్స్ డే జరుపుకోవడానికే యువత ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. 
 
మనసులో మాట చెప్పే మార్గాలు
ప్రేమికుల రోజు ఎలా ఎంజాయ్‌ చేయాలి? మదిలోని భావాలను ఎలా పంచుకోవాలి? స్వీట్‌ మెమరీగా గుర్తుండాలంటే ఏంచేయాలి? ఇలాంటివన్నీ ప్రేమికులకు కష్టమైన ప్రశ్నలు. అన్నింటికన్నా పెద్ద ప్రశ్న మనసులోని మాట నచ్చిన వ్యక్తికి ఎలా చెప్పాలనేదే. అయితే పాత పద్థతులుగా అనిపిస్తున్నప్పటికీ ఇప్పటికీ ప్రేమికులు అలాంటి వాటినే ఉపయోగిస్తున్నారు. మరి మీ మనసులోని మాట చెప్పాలంటే ఉన్న దార్లేంటో తెలుసుకోండి! ఎలా చెప్పినా సరే మీ మనసుకు నచ్చిన వ్యక్తికి మీలోని నిజాయితీ, మీ ప్రేమా కనిపించాలి. అది మీరు మనస్పూర్తిగా ఇస్తేనే సాధ్యపడుతుంది. 
 
అందంగా చెప్పండి: నోటితో చెప్పడానికి భయపడే వారికి గ్రీటింగ్‌ కార్డ్స్‌ చక్కని మార్గం. మంచి ముఖచిత్రంతో ఉన్న గ్రీటింగ్‌ కార్డ్స్‌ ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచండి. కుదిరితే మీరే చక్కని గ్రీటింగ్‌కార్డ్‌ మీ చేతుల్తో తయారు చేసివ్వండి.
 
మదిలోని భావాలు: కొందరు కవిత్వం రాసేవారు ఉంటారు. అలాంటి వారు తమ మదిలో భావాలను, తనతో ఉన్న జ్ఞాపకాలతో ముడివేస్తూ అందంగా రాసి ఇవ్వండి. ప్రేమలేఖను రాయండి.
జ్ఞాపకాలే బహుమతిగా: మీ ప్రియమైన వారితో ఉన్న ఫోటోలను తిరిగి జ్ఞాపకం చేస్తూ ఒక ఆల్బమ్‌గా తయారు చేసి వారికి తీపి గుర్తుగా ఇవ్వండి.
పువ్వుల్లో పెట్టి: మీరు రాిసిన అందమైన ప్రేమలేఖను ఒక గిఫ్ట్‌తో జతచేస్తూ పువ్వుల్లో పెట్టి తనముందు ఉంచండి. పువ్వులు రకరకాల భావాలను వ్యక్తీకరిస్తాయి. ఒక్కో రకం పూవు ఒక్కో రకం రిలేషన్‌కి చిహ్నం. అందుకని రెడ్‌ రోజాలను మాత్రమే ఎంచుకోండి. 
 
ట్రెండ్‌ మారుతోంది
ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే చాలు ప్రేమికులు ఒకరినొకరు ఇంప్రెస్‌ చేసుకోవడానికి మదనపడుతుంటారు. ప్రత్యేకించి ప్రియురాలి మనసు దోచుకునేందుకు ఎలాంటి కానుక ఇవ్వాలో తెలియక ప్రేమికుడు తెగ ఆలోచి స్తుంటాడు. ఇక ప్రత్యేకమైన అభిరుచులు, బహుమతుల విషయంలో పట్టింపులున్న అమ్మాయి విషయంలో మరింత జాగ్రత్త తీసుకోక తప్పదు. ఒకప్పుడు పూలు, చాక్లెట్లు, అందమైన బొమ్మలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం వారికి అందాన్ని బహుమతిగా ఇస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నేటి తరం కోరుకునే సరికొత్త కానుక సౌందర్యమే. అందుకోసం వారికి సౌందర్య చికిత్స, కాస్మొటిక్స్‌ బాక్సులు, ఎక్కువ ఖర్చుపెట్టి చేసే ట్రీట్‌మెంట్స్‌లాంటివి గిఫ్ట్‌గా ఇస్తున్నారు అబ్బాయిలు. ఈ వాలెంటైన్స గిఫ్ట్‌లతో పెద్ద వ్యాపారమే నడుస్తోంది. భార తలో ఒక వాలెంటైన్స డే నాడు 1300 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందని భారత వాణిజ్య మండలి తెలిపింది. 
 
ప్రేమలో పడితే సంకేతాలివే
ప్రేమలో పడ్డారని గుర్తించడం కొంచెం ఆలస్యం కావచ్చు. ఎందుకంటే వారికున్నది ప్రేమా, ఆకర్షణా అనేది తెలియకపోవడంవల్ల కావచ్చు. మరికొందరు త్వరగానే గుర్తించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రత్యేకంగా ఇలానే ఉంటారని కానీ ఇలాగే ఉండాలని కానీ ఏమీ లేదు. కాకపోతే కొన్ని లక్షణాలు అందరిలో ఒకలాగే ఉంటాయి. అలాంటివి మీలోనూ ఉన్నాయేమో, మీరు ప్రేమలో పడ్డారేమో చెక్‌ చేసుకోండి. 
 
1. ఎప్పుడూ మీ ప్రేయసిని కానీ, ప్రియుణ్ణి కానీ చూడాలని అనిపించడం. తనతోనే ఉండాలని అనిపించడం.
 
2. వారి దగ్గర నుంచి వచ్చే సందేశం కోసం కానీ, ఫోన కాల్‌ కోసం కానీ వేచి చూడడం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే వారికి సమాధానం ఇవ్వడం కోసం ఆత్రంగా ఉండడం. తరచూ ఫోన్ తనిఖీ చేస్తూ ఉండడం.
3. కొన్నిసార్లు మీకిష్టం లేకున్నా సరే మీరు ప్రేమించే వ్యక్తి కోసం రాజీపడడం
4. ప్రేమించే వ్యక్తికోసమే కార్యక్రమాలను మార్చు కోవడం. ఒక్కొక్కసారి ప్రాధాన్యం గలవాటిని కూడా తనకోసం వదిలేసుకోవడం.
 
5. కారణం ఏమీ ఉండకపోయినా, కొన్ని సార్లు మీలో మీరే నవ్వుకోవడం. తనతో ఉన్న క్షణాలను ఎప్పుడూ గుర్తు తెచ్చుకోవడం. తనని కేర్‌గా చూసుకోవాలని అనుకోవడం.
 
వాళ్లకు ప్రేమికుల రోజు అప్పుడే!
స్పెయిన్ దేశంలో రెండో అతిపెద్ద జనాభా నగరం బార్సిలోనా. ఈ నగరంలో ఒక రోజు అమ్మాయి అబ్బాయికి పుస్తకం గిఫ్ట్‌గా ఇస్తే ప్రతిగా అబ్బాయి, అమ్మాయికి గులాబీ పువ్వు ఇస్తాడు. అలాగని అది కేవలం ప్రేమికులకే పరిమితమైన వ్యవహారం కాదు. స్ర్తీ పురుషుల్లో ఎవరు ఎవరి పట్ల ఇష్టం ప్రేమ ఉన్నా వ్యక్తం చేయడానికి ఈ రోజును ఒక అవకాశంగా భావిస్తారు. వారి మధ్య బంధం ఎలాంటిదైనా ఉండొచ్చు. సంత జోర్డీ డే లేదా సెయింట్‌ జార్జ్‌ డే అని పిలిచే ఈ పండుగను ప్రతి ఏడాది ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒక విధంగా దీన్ని వాళ్ళ వాలెంటైన్స డే అని చెప్పవచ్చు. అలాగని అక్కడ వారికి అది సెలవు రోజు కాదు. ఇలా వారు జరుపుకోవడానికి ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఆ ఊరి పరిసర ప్రాంతాల్లో ఓ డ్రాగన ఉండేదట. అది ఒక రోజు ఓ గ్రామంపై దాడి చేసి ఒక రాజకుమారిని చంపబోతుంటే ఆ సమయంలో సంత జోర్డీ అనే వ్యక్తి ఆ రాకుమారిని డ్రాగన నుంచి రక్షిస్తాడు. ఆ సంఘటనకు గుర్తుగా ప్రజలు ఈ పండుగ జరుపుకుంటారు బార్సిలోనా వాసులు. ఈ పండు గను ప్రతీ సంవత్సరం ఏప్రిల్‌ 23న జరుపుకుంటారు. సో, ఆ రోజే వాళ్లకు వాలెంటైన్స డే అన్నమాట!
 
వాలెంటైన్ డే పుట్టుక
ప్రేమికుల ప్రత్యేకరోజుగా చెప్పుకునే వాలెం టైన్స డే జరుపుకోవడం వెనుక, దాని పుట్టుక వెనుక ఇప్పటివరకూ కచ్చితమైన సమాచారం ఏదీ తెలియదు. అయితే పలు కథనాలున్నాయి. వాటిల్లో ముఖ్యంగా చాలా ఎక్కువ ప్రాచుర్యం పొందింది వాలెంటైన కథనం. మూడో దశాబ్దం నాటి రోమ్‌ సామ్రాజ్యంలో వాలెంటైన పేరుతో ఒక క్రైస్తవ సన్యాసి ఉండేవారు. అప్పటి చక్రవర్తి క్లాడియస్‌-2. వివాహితులతో పోలిస్తే అవివాహితులే సైనికులుగా బాగా పనిచేస్తారని చక్రవర్తి భావించాడు. దాంతో యువకులు పెళ్ళిళ్ళు చేసుకోరాదనే ఆంక్షలు విధించారు. వాలెంటైన సన్యాసికి ఇది అన్యాయంగా తోచింది. రహస్యంగా యువకులకు పెళ్ళిళ్ళు చేయించడం మొదలుపెట్టాడు. క్లాడియ్‌సకు ఈ విషయం తెలిసింది. చక్రవర్తి ఆదేశాలు ధిక్కరించినందుకు వాలెంటైనకు మరణశిక్ష అమలు చేశారు. అతను జైలు నిర్బంధంలో ఉండగా తన కుమార్తెకు ఓ లేఖ రాసి అందులో చివర్న -నీ వాలెంటైన అని రాసి, ఉరికంబానికెక్కుతాడు.

మరో కథనం ప్రకారం వాలెంటైన ఒక రోజు జైలర్‌ కుమార్తెను చూసి మనసు పారేసుకుంటాడు. తనకు ఉరిశిక్ష అమలు చేసే ముందు ఆమెకు ఓ లేఖ రాసి అందులో - నీ వాలెంటైన అని ముగిస్తాడు. ఇలా మరికొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వాలెంటైన చనిపోయిన రోజు కూడా ఫిబ్రవరి 14 కాదు, కనీసం ఆరోజు అతని పుట్టినరోజు కూడా కాదు.

మరో వైపు సంతానం కోసం జట్టు కట్టడానికి ఫిబ్రవరి నెల అనువైనదిగా వెనుకటి రోమన చక్రవర్తులు భావించినట్లు చెబుతారు. అందుకోసం ఒక రోజును నిర్ణయించారని కూడా అంటారు. అధికారికంగా 5వ శతాబ్దంలో పోప్‌ గెలాసియస్‌ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే అని ప్రకటించారు. ఆ తర్వాత దీనిని పెద్దగా జరుపుకున్నట్లు లేదు. మరీ ముఖ్యంగా 20వ శతాబ్దంలోనే వాలెంటైన్స్ డే బాగా ప్రాచుర్యం పొందింది. 


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu