మేషం (మార్చి 21-ఏప్రిల్ 20 మధ్య పుట్టినవారు)
ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలకు తగిన సమయం కాదు. సమావేశాల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోవచ్చు. యూనియన్లు, సహకార సంఘాల వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తారు.
వృషభం (ఏప్రిల్ 21 - మే 21 మధ్య పుట్టిన వారు)
పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. రాజకీయ, సినీ రంగాల వారు మాటపడాల్సి వస్తుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు.
మిథునం (మే 22-జూన్ 21 మధ్య పుట్టినవారు)
ఆర్థిక విషయాల్లో అంచనాలు ఫలించకపోవచ్చు. సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో ఖర్చులు అధికం. ఉన్నత విద్యా సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
కర్కాటకం (జూన్ 22 - జులై 22 మధ్య పుట్టిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక విషయాలు ఆందోళన కలిగిస్తాయి. పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. పింఛన, గ్రాట్యుటీ, మెడికల్ క్లెయిములు పరిష్కారం అవుతాయి. లక్ష్య సాధనలో అనుభవం తోడ్పడుతుంది.
సింహం (జులై 23 - ఆగస్టు 23 మధ్య పుట్టినవారు)
సమావేశాలు, వేడుకల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. బంధుమిత్రుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలపై సన్నిహితులతో చర్చిస్తారు. స్నేహ బాంధవ్యాలు బలపడతాయి.
కన్య(ఆగస్టు 24-సెప్టెంబర్ 22 మధ్య పుట్టినవారు)
సన్నిహితుల వ్యవహార శైలి ఆవేదన కలిగిస్తుంది. ప్రియతముల ఆంతరంగిక విషయాలపై దృష్టి పెడతారు. అడ్వాన్సులు అందుకుంటారు. రుణాలు మంజూరవుతాయి. సంకల్పం నెరవేరుతుంది.
తుల(సెప్టెంబర్ 23-అక్టోబర్ 23 మధ్య పుట్టిన వారు)
ఆర్థిక విషయాల్లో శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టే అవకాశం ఉంది. చిన్నారుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృశ్చికం (అక్టోబర్ 24- నవంబర్ 22 మధ్య పుట్టినవారు)
బదిలీలు, మార్పులు, చేర్పుల కారణంగా అసౌకర్యానికి గురవుతారు. సహోద్యోగులతో కుటుంబ విషయాలు చర్చకు వస్తాయి. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, హోటల్, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరం.
ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 21 మఽధ్య పుట్టిన వారు)
వృత్తి విద్యా వ్యవహారాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రియతములతో వాగ్వాదాలకు దిగకండి. చిన్నారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి.
మకరం (డిసెంబర్ 22-జనవరి 20 మధ్య పుట్టిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.
కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 18 మధ్య పుట్టిన వారు)
విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. రవాణా, ఏజెన్సీలు, బోధన, మార్కెటింగ్ రంగాల వారి అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. పర్యటనలు, చర్చలకు అనుకూలం.
మీనం (ఫిబ్రవరి 19- మార్చి 20 మధ్య పుట్టినవారు)
ఆర్థిక విషయాలు ఆశాంతి కలిగిస్తాయి. పెట్టుబడులు, పొదుపు వ్యవహారాల్లో అంచనాలు ఫలించకపోవచ్చు. రాజకీయ, సినీ రంగాల వారికి ఖర్చులు అంచనాలు మించుతాయి. దానధర్మాలకు వెచ్చిస్తారు.
Post a Comment