న్యూయార్క్: కొత్త ఏడాదిలో ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ట్వీటర్ గురించి ఒక వార్త కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతోంది. ట్వీటర్‌లో అక్షరాల(క్యారెక్టర్స్) పరిమితిని 140 నుంచి 10 వేలకు పెంచాలని యోచిస్తోందన్నది ఆ వార్త సారాంశం. దీనికి సంబంధించి ట్వీటర్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా లేదు. అయితే.. పదేళ్లుగా 140 అక్షరాలకే పరిమితమైన ట్విట్టర్ ఇప్పుడు అక్షరాల పరిమితిని పెంచాలనే విప్లవాత్మక నిర్ణయం గురించి ఎందుకు ఆలోచిస్తోంది. ఇప్పుడు అందరి నుంచీ వస్తున్న ప్రశ్న ఇదే.
ప్రస్తుతం మీడియా కల్చర్‌లో అనూహ్య మార్పులు వచ్చాయి. 24 గంటలు వార్తలను అందించడం అత్యవసరం కావడంతో వేగానికి ప్రాముఖ్యత పెరిగింది. ఒక అంశానికి సంబంధించిన వాస్తవాలు, సమాచారాలు, వ్యాఖ్యలు, వాదనలు, ప్రతివాదనలు తక్షణం అందించడం అత్యావశ్యకమైంది. అయితే ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్వీటర్ వంటి వాటిలో ఈ స్థాయి కమ్యూనికేషన్ టెక్నాలజీలను వినియోగించడం లేదు. పెట్టుబడిదారీ ప్రభావం కలిగిన అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు.. తమ డాటాను వీటికి అందజేయడం లేదు. అయితే ట్విట్టర్ 140 అక్షరాల లిమిట్.. యూజర్లు తమ అభిప్రాయాలను లైక్స్, ట్విట్స్, రీట్విట్స్ ద్వారా క్లుప్తంగా చెప్పాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. దీని వల్ల వాద ప్రతివాదనలకు ఎక్కువ ఆస్కారం దక్కడం లేదు.
ఇదే సమయంలో సహచర సైట్లతో పోలిస్తే.. ట్వీటర్ ప్రకటనల వ్యాపారం అంత లాభదాయకంగా లేదు. గత మూడేళ్లుగా నష్టాలబాటలోనే నడుస్తోంది. ఇదే సమయంలో ఫేస్‌బుక్ లాభాల్లో దూసుకుపోతోంది. అయితే ట్వీటర్ వేగం, కచ్చితత్వం అడ్వర్టైజింగ్‌కు అనుకూలం. దీంతో సీఈవో జాక్ డోర్సే ట్విట్టర్ టెక్నాలజీ డిజైన్‌ను మారిస్తే సంస్థ ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పది వేల అక్షరాలకు ట్విట్లను పెంచితే లాభాల బాట పట్టొచ్చని ట్వీటర్ భావిస్తోంది. అయితే అడ్వర్టైజ్‌మెంట్లు లేకుంటే సైట్ నడపడం కష్టమా.. అంటే దానికి వీకీపీడియానే సమాధానం. ఇందులో ఎటువంటి ప్రకటనలు ఉండవు. అయినా ఇది మోస్ట్ పాపులర్ వెబ్‌సైట్లలో ఒకటి. దీనికి విరాళాలు.. గ్రాంట్లు.. కొన్ని పెయిడ్ సర్వీసులు దీనికి నిధులు అందిస్తున్నాయి. ఇదే పద్ధతి ట్వీటర్‌కు ఎందుకు వర్తించదు..?
Post a Comment