Skip to main content

టుడే అప్‌డేట్స్‌...!!


♦ అనంతపురం జిల్లాలో నేడు ఆరో రోజు వైఎస్‌ జగన్‌ రైతు భరోసాయాత్ర
♦ నేడు హైదరాబాద్‌కు రానున్న కాంగ్రెస్‌ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌‌, గులాంనబీ ఆజాద్
♦ విశాఖలో నేడు రెండో రోజు పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌
♦ నేడు మెదక్‌ జిల్లా దుబ్బాకలో సీఎం కేసీఆర్‌ పర్యటన
♦ నేడు జీహెచ్‌ఎంసీ బీజేపీ, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల
♦ విశాఖ: నేడు ఆంధ్రయూనివర్సిటీలో వైస్‌ చాన్సలర్లు, రిజిస్టర్ల సదస్సు
♦ నేడు, రేపు మహారాష్ట్రలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ల పర్యటన
♦ తెలంగాణలో నేటినుంచి పోలీసు కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తులు, 9,281  పోస్టులకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు
♦ హైదరాబాద్‌: నేడో రేపో పాలమూరు ప్రాజెక్ట్‌కు టెండర్, రూ. 27వేల కోట్ల టెండర్లకు ఆహ్వానం
♦ నేడు ఆర్టీసీ అధికారులతో మంత్రి మహేందర్‌ రెడ్డి భేటీ, మేడారం జాతరకు రవాణా ఏర్పాట్లపై చర్చ
♦ నేడు పార్టీనేతలతో రాహుల్‌ గాంధీ సమావేశం, సీనియర్‌ నేతలతో రాజకీయ పరిణామాలపై చర్చ
♦ నేటితో ముగియనున్న జేఈఈ మెయిన్స్‌ దరఖాస్తు గడువు
♦ నేటి నుంచి రోడ్డు భద్రత వారోత్సవాలు
♦ నేడు కరీంనగర్‌లో మంత్రి ఈటెల రాజేందర్‌, మహేందర్‌ రెడ్డి పర్యటన
♦ నేడు పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పర్యటన

Comments

Popular posts from this blog

మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి

నేటి వార్తావిశేషాలు నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నేడు కేటీపీఎస్ రెండోదశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న కేసీఆర్ నేడు కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన.'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ఉన్నతాధికారులు సీఎస్, డీజీపీ నేడు గ్రేటర్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ నేటి నుంచి రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన ఆప్ నేతలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం దావాపై నేటు పాటియాల హౌజ్ కోర్టులో విచారణ

50 లక్షల ఉద్యోగాలు స్వాహా....

తిక్క లెక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రోబోల వాడకం వల్ల లేదా వాటి కృత్రిమ మేధ వల్ల రానున్న 5 ఏళ్లలో దాదాపు 15 దేశాలలో సుమారు 50 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని తాజా అధ్యయనం తెలుపుతోంది. దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ (డబ్ల్యు.ఇ.ఎఫ్) వార్షిక సమావేశాలలో ఆ మేరకు నివేదిక విడుదలైంది. వాస్తవానికి 70 లక్షల ఉద్యోగాలు పోనున్నాయని, అయితే ఈ కృత్రిమ మేధను ఉపయోగంలోకి తేవడానికి అవసరమైన 20 లక్షల కొత్త ఉద్యోగాలు అవసరమైనందుకు స్థూలంగా 50 లక్షల ఉద్యోగాలు పోకతప్పదని నిర్థారిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయేవాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ శాతం ఉండొచ్చట. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, గుమస్తాగిరి వీటిలో ఎక్కువగా ఉండేది మహిళా ఉద్యోగులే కనుక రోబోల వాడకం ఇక్కడే ఎక్కువ కానున్నది కనుక భారీ నష్టం ఆడవారికేనని తాజా హెచ్చరిక. సో... రోబోలకు చిక్కని మేధో ఉపాధి మార్గాలలోకి స్త్రీలు బదిలీ కాకతప్పదేమో.