సంక్రాంతికి సినిమాల సందడి
తమిళులు పొంగల్‌గా జరుపుకునే ముఖ్య పండగ సంక్రాంతి. దీన్ని సినీ వర్గాల పండగగా కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజున పలు భారీ చిత్రాలు విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధమవుతారు. అలా ఈ ఎడాది నాలుగు చిత్రాలు పొంగల్‌కు సిద్ధమవుతున్నాయి. వాటిలో కథాకళి, గెత్తు,రజనీమురుగన్, తారైతప్పట్టై చోటు చేసుకున్నాయి. ఇక వాటి వివరాలు చూస్తే నటుడు విశాల్ కథానాయకుడుగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం కథాకళి. క్యాథరిన్ ట్రెసా నాయకిగా నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. ఇది పూర్తి కమర్షియల్ ఎంటర్‌టెయిన్‌మెంట్‌తో రూపొందిన చిత్రం అంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. దీన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ విడుదల చేయనుంది. జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత బాలా దర్శకత్వం వహిస్తున్న చిత్రం తారైతప్పట్టై. శశికుమార్ హీరోగా నటిస్తూ తన కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. నటి వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్‌గా నటించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించారు.
ఇది ఆయనకు వెయ్యొవ చిత్రం కావడం విశేషం. తమిళనాట ప్రసిద్ధి గాంచిన గరగాట్టం నృత్యం ఇతి వృత్తంగా తెరకెక్కిన చిత్రం తారైతప్పట్టై. దీనికి దర్శకుడు బాలా బి.స్టూడియోస్, ఐన్‌గరన్ ఇంటర్‌నేషనల్ మీడియా ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలు నిర్మాణంలో భాగస్వామిగా ఉండడం విశేషం. మూడో చిత్రం గెత్తు. యువ నటుడు ఉదయనిధి స్టాలిన్ తన రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తూ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గెత్తు. ఇందులో ఎమిజాక్సన్ హీరోయిన్. ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రం ద్వారా తొలిసారిగా యాక్షన్ హీరోగా అవతారమెత్తారు. తిరుకుమరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పొంగల్ రేస్‌లో ఉంది. ఇక నాల్గవ చిత్రం రజనీమురుగన్. శివకార్తీకేయన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కీర్తీసురేశ్ హీరోయిన్. పొన్‌రామ్ దర్శకుడు. దర్శకుడు లింగసామి సమర్పణలో తిరుపతి బ్రదర్స్ ఫిలిం మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుభాష్ చంద్రబోస్ నిర్మించారు.
డీ. ఇమాన్ బాణీలు కట్టిన ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని చాలా కాలమైంది. పలు సమస్యలను ఎదుర్కొని, పలుమార్లు విడుదల తేదీలు వాయిదాపడ్డా ఎట్టకేలకు పొంగల్‌కు తెరపైకి రానుంది. విశేషం ఏమిటంటే ఈ ఏడాది తొలిరోజే ఎనిమిది చిత్రాలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ నాలుగు చిత్రాలకు ముందే 8వ తేదీన కైల పూ మాలై చిన్న చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిలో ఏ చిత్రం కాసుల వర్షం కురిపించి విజయం అనిపించుకుంటాయో వేచి చూడాలి.

Post a Comment