విజయ్ టైటిల్‌లో విక్రమ్
చిత్రాలకు టైటిల్స్ చాలా ప్రధానం అన్నది ఎవరూ కాదనలేని విషయం. కథ, కథనాలు ముఖ్యం అయినా, ముందుగా ప్రేక్షకుల్ని థియేటర్లకు తీసుకెళ్లడానికి ఆయా చిత్రాల పేర్లు ప్రధాన పాత్ర అవుతాయి. అలాంటి పేర్ల కోసం ఇప్పుడు దర్శక నిర్మాతలు కాస్త ఎక్కువగానే శ్రమ పడాల్సి వస్తోందని చెప్పక తప్పదు. ఇక విషయానికి వస్తే ఇటీవల విజయ్ నటించిన పులి చిత్రానికి పులుపేర్లను పరిశీలించారు. అందులో ఒకటి గరుడా. చివరికి పులి పేరును నిర్ణయించారు. ఇప్పుడా గరుడా విక్రమ్ చిత్రానికి టైటిల్ కానుందన్నది సమాచారం.
ఐ చిత్రం టార్గెట్‌ను రీచ్ కాకపోవడం, ఆ తరువాత చేసిన 10 ఎండ్రదుక్కుల్ చిత్రం డిజాస్టర్‌గా నమోదు కావడంతో విక్రమ్ నిరాశ కమ్ముకున్న మాట నిజం. అందువల్ల ఆలస్యం అయినా పర్వాలేదనుకుని తదుపరి చిత్రాల విషయంలో ఆచి తూచి అడుగేస్తున్న విక్రమ్ తాజాగా ఏక కాలంలో రెండు చిత్రాలను చేయడానికి సిద్ధమయ్యారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం ఒక చిత్రం, దర్శకుడు తిరు దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. తిరుతో చేస్తున్న చిత్రాన్ని పులి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శిబితామీన్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి గరుడా అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తాజా సమాచారం.

Post a Comment