అనంతపురం : అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పాపవాండ్లపల్లిలో తెలుగు తమ్ముళ్ల కీచక పర్వం బయట పడింది. వివాహితపై టీడీపీనేత రామస్వామి అత్యాచారానికి యత్నించాడు. ఘటన బయటికి పొక్కకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. రూ20 వేలు తీసుకుని రాజీ చేసుకోవాలంటూ బాధితురాలిని టీడీపీ నేతలు బెదిరించారు.
మరో వైపు పోలీసులు సైతం కేసు నమోదు చేసుకోడానికి నిరాకరించారు. 20 రోజులుగా ఫిర్యాదు తీసుకోకుండా.. వేధించారు. చివరకు హెచ్ఆర్సీ జోక్యం చేసుకోవడంతో.. పోలీసులు విచారణ ప్రారంభించారు. తన లాగే.. ఎంతో మంది మహిళలపై టీడీపీ నేతలు వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఆరోపించింది. నేతల బెదిరింపుల వల్ల ఘటనలు బయటికి పొక్కడం లేదని తెలిపింది.
Post a Comment