Delhi : దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన సునంద పుష్కర్ మర్డర్ మిస్టరీ మరి కాసేపట్లో వీడనుంది. ట్విస్ట్ ల మీద ట్విస్టులతో థ్రిల్లర్ సినిమాను తలపించిన.. సునంద మృతి కేసు.. సుదీర్ఘ విచారణ అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ వెల్లడించనున్నారు.
కేసు విచారణ, ఎయిమ్స్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ వివరాలను పోలీస్ కమిషనర్ బస్సీ వివరిస్తారు. సునంద మరణానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ కేసులో సునంద పుష్కర్ భర్త, కాంగ్రెస్ నేత శశిథరూర్ ను మరో మారు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.
2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఫైవ్‌స్టార్ హోటల్ గదిలో 52 ఏళ్ల పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎన్నో మలుపులు తిరిగిన సునంద మృతిపై పోలీసులు పలుమార్లు సునంద భర్త శశిథరూర్ తో సహా.. పలువురిని విచారించారు.
Post a Comment