బ్రిస్బేన్:టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా 309 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. ఆసీస్ ఇన్నింగ్స్ ను షాన్ మార్ష్, ఆరోన్ ఫించ్ లు ఆరంభించారు. అంతకుముందు టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఓపెనర్ రోహిత్ శర్మ(124), విరాట్ కోహ్లి(59), అజింక్యా రహానే(89)లు రాణించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసింది. ఐదు వన్డేలో సిరీస్ లో టీమిండియా తొలి వన్డేలో ఓటమి పాలైంది. దీంతో ఈ వన్డేలో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది.
Post a Comment