జైపూర్: రాజస్థాన్ లోని జైపూర్ లో అమానుషం చోటు చేసుకుంది. కన్నకూతుర్ని తండ్రి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. శ్రీగంగా నగర్ జిల్లాలోని లాఖా హాకం గ్రామానికి చెందిన రైతు నారాయణ జాట్(45) కూతురు (21)ని కిరాతకంగా హత్య చేశాడు. డిగ్రీ చదువుతున్న యువతి, తన సహవిద్యార్థి, అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నించింది.
అయితే ఇద్దరి వేర్వేరు కులాలు కాడంతో కూతురి పెళ్లిని తండ్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆ కుర్రాడితో తెగతెంపులు చేసుకోవాలని నారాయణ్ రామ్ చాలాసార్లు కూతుర్ని హెచ్చరించాడు. బయటకు వెళ్లేందుకు వీల్లేదని ఆంక్షలు పెట్టాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన తండ్రి ఆమెను గొంతు నులిమి చంపేశాడు. భార్య, కొడుకు చూస్తుండగానే ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. అనంతరం పోలీస్ స్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. పరువు కోసమే ఈ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
Post a Comment